
క్రైమ్ మిర్రర్, నల్గొండ బ్యూరో :- దళిత యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేసిన నిందితుడికి 27 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం కనగల్ మండల పరిధిలోని పర్వతగిరి గ్రామానికి చెందిన నల్లబోతు జగన్ గుర్రంపోడు మండలం శాఖపురం గ్రామానికి చెందిన యువతికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసిన తరువాత మాట మార్చగా బాధితురాలు నిందితుడు నల్లబోతు జగన్ పైన గుర్రంపోడు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు Cr.No.84/2019, SC.No.88/2020
U/s 417, 420, 376(n) IPC &Sec 3 (2) (v) of SC/ST (POA) Act-1989 of PS Gurrampode. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహించి సరైన ఆధారాలు సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.
నిందితునికి గురువారం జిల్లా అదనపు సెషన్ & ఎస్సి ఎస్టీ కోర్ట్ సెక్షన్ 376(2)(n) IPC కింద నిందితుడికి పది (10) సంవత్సరాల జైలు మరియు RS 1000/- జరిమానా, మరియు SC/ST (POA) చట్టంలోని సెక్షన్ 3(2)(v) కింద నేరానికి నిందితుడికి పది (10) సంవత్సరాల జైలు తో పాటు RS 1000/- జరిమానా, అలాగే ఐపీసీ సెక్షన్ 420 కింద నేరానికి నిందితుడికి ఏడు (7) సంవత్సరాల జైలు మరియు RS. 1000/- జరిమానా కలిపి నిందితునికి మొత్తం 27 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది. ఈ కేసులో సరైన ఆధారాలను సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన అప్పటి విచారణ అధికారులు SDPO లు S.మహేశ్వర్, T.ఆనంద్, ASI MD. ఖలీల్ అహ్మద్, PS గుర్రంపోడ్, ప్రస్తుత A.S.P పి.మౌనిక, SHO పి.మధు, సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పిఎస్ గుర్రంపోడ్, CDO MD.ఇంతియాజ్ హమ్మద్, లైజన్ అధికారులు పి.నరేందర్, ఎన్.మల్లికార్జున్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.