
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఓ వింత ప్రేమ ఘటన ఇప్పుడు స్థానికంగా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ప్రియురాలిని కలవాలనే ఉత్సాహంతో ఆమె ఇంటికి వెళ్లిన ఓ యువకుడు చివరకు అక్కడే అడ్డంగా దొరికిపోయాడు. తప్పించుకున్న ప్రేమికుడు చివరకు పెట్టెలో దాక్కొని పోలీసుల చేతికి చిక్కిన ఈ ఘటన కాన్పూర్ జిల్లాలో జరిగింది.
View this post on Instagram
శుక్రవారం కాన్పూర్ నగరంలోని చకేరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. చకేరీలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి కొన్నేళ్లుగా అదే ప్రాంతంలో నివసిస్తున్న ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తోంది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయాన్ని అవకాశంగా భావించిన ఆ యువతి, శుక్రవారం ఉదయం తన ప్రేమికుడిని ఇంటికి పిలిపించింది.
ఆ సమయంలో యువతి అన్నయ్య ట్రాక్టర్‌తో బయటకు వెళ్లగా, తల్లి ఫ్యాక్టరీలో పనికి వెళ్లింది. దీంతో ఇంట్లో యువతి ఒంటరిగా ఉండడంతో ప్రేమికుడు ధైర్యంగా ఇంటికి చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి గడుపుతున్న సమయంలో అనుకోని అతిథిగా పొరుగింట్లో నివసిస్తున్న యువతి అత్త ఇంటికి చేరుకుంది. తలుపు తట్టినా లోపల నుంచి స్పందన రాకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది.
అత్త పదే పదే తలుపు తట్టడంతో భయపడిన యువతి తన ప్రేమికుడిని వెంటనే ఇంట్లో ఉన్న ఓ పెద్ద పెట్టెలో దాచేసింది. అనంతరం తలుపు తీయకుండా కాలయాపన చేస్తూ పరిస్థితిని తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే అత్తకు అనుమానం మరింత పెరగడంతో ఆమె యువతి సోదరుడికి, తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది.
వెంటనే యువతి సోదరుడు ఇంటికి చేరుకుని పరిస్థితిని గమనించాడు. ఇంట్లో ఏదో తేడా ఉందని అనుమానించిన అతడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తెరిపించారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులు ఇళ్లు మొత్తం తనిఖీ చేయగా యువకుడి ఆచూకీ మాత్రం కనిపించలేదు.
ఇంతలో ఇంట్లోని ఓ పెట్టెలో నుంచి స్వల్పంగా శబ్దం వినిపించడంతో అందరి దృష్టి అక్కడికే వెళ్లింది. కుటుంబ సభ్యులు పెట్టె తాళం చెవి ఇవ్వాలని యువతిని అడగగా.. ఆమె తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పెట్టెను తెరవగా, అందులో నుంచి ప్రేమికుడు బయటకు రావడంతో అందరూ షాక్ అయ్యారు.
తక్షణమే యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని చకేరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. యువకుడితో పాటు యువతిని కూడా ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని చకేరి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అజయ్ ప్రకాష్ మిశ్రా వెల్లడించారు. ఈ ఘటన మరోసారి యువత ప్రేమ వ్యవహారాల్లో తీసుకునే తొందరపాటు నిర్ణయాలు ఎలాంటి ఇబ్బందులకు దారి తీస్తాయో చూపిస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ALSO READ: మేడారానికి హెలికాప్టర్ సేవలు.. ఛార్జ్ ఎంతో తెలుసా?





