
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- పెంపుడు కుక్క గోరు గుచ్చుకొని యువకుడు మరణించిన ఘటన కొత్తగూడెం పరిధిలో ఏడూళ్ళ బయ్యారానికి చెందిన సందీప్ (25) రెండు నెలల క్రితం కుక్కపిల్లని ఇంటికి తెచ్చుకున్నాడు. మచ్చిక చేసుకుంటుండగా అది తన తండ్రిని కరిచింది. అదే సమయంలో కుక్క కాలి గోరు సందీప్ కి గుచ్చుకుంది తండ్రికి చికిత్స చేయించిన అతడు తన గాయాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఆ గాయం ఇటీవల ఎక్కువ అయ్యి ఇబ్బంది పడుతుండగా కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు తనకు రేబిస్ సోకినట్లు నిర్ధారించారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ సోమవారం ఆ యువకుడు మరణించాడు.
Read also : వివాహేతర సంబంధం పెట్టుకున్నారా?.. అయితే ఇది మీకోసమే!
రేబిస్ లక్షణాలు కనిపిస్తే బతకడం కష్టమే
కుక్క కాటుకు సంబంధించి రేబిస్ వ్యాధి చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ లక్షణాలు( జ్వరం, తలనొప్పి, బలహీనత, అయోమయం, నీటిని చూసి భయపడటం,) వంటి లక్షణాలు కనిపిస్తే రక్షించడం అసాధ్యమైన పని అని పేర్కొంటున్నారు. కుక్క కరిసిన వెంటనే ఆలస్యం చేయకుండా వ్యాక్సిన్లు వేయించుకోవాలని సూచిస్తున్నారు. ఆఖరికి కుక్క గోరు గుచ్చుకున్నా నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నారు. పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్లు వేయాలని చూపిస్తున్నారు.
Read also : వివాహేతర సంబంధం పెట్టుకున్నారా?.. అయితే ఇది మీకోసమే!