
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- మన టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి. సినిమా ఎంత పెద్ద స్టార్ హీరో తీసిన కూడా కథ బాలేదంటే మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు థియేటర్లకు వెళ్లకుండా ఆ సినిమాని పక్కాగా ఫ్లాప్ చేస్తారు. అదే కథ బాగుంది అంటే ఎంత చిన్న హీరో సినిమా అయినా.. ఎంత చిన్న బడ్జెట్ సినిమా అయినా కూడా థియేటర్లకు ప్రేక్షకులు పరుగులు తీస్తారు. ఇక యంగ్ హీరో తేజ సజ్జ కథల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు. వెంట వెంటనే సినిమాలు చేయకుండా… కథను బట్టి కొంచెం లేట్ అయిన మంచి కథతో రావాలనే ఆలోచన ఉన్నవాడు. బహుశా అందుకేనేమో… హనుమాన్ సూపర్ హిట్ అయిన తర్వాత దాదాపు మూడు సంవత్సరాల తరువాత మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల వద్దకు వచ్చాడు తేజ. ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన ఘనంగా థియేటర్ల వద్ద విడుదల అయింది. ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. తాజాగా ఈ చిత్రం 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 92 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టినట్లుగా సినిమా మూవీ మేకర్స్ ప్రకటించారు.
Read also : షేక్ హ్యాండ్ ఇవ్వాలనే చట్టం ఏం లేదు : బీసీసీఐ అధికారి
ఈ సినిమాలో హీరో తేజ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అలాగే విలన్ పాత్రలో నటించిన మంచు మనోజ్ కూడా తన పాత్రకు మించి నటించడంతో ప్రేక్షకులు మంచు మనోజ్ ను కూడా హైలెట్ చేస్తున్నారు. ఈ సినిమా తొలి రోజు 27 కోట్లు రాబట్టగా.. రెండో రోజు 28 కోట్లు… ఇక మూడో రోజు 25 కోట్లు, నాలుగో రోజు 10 కోట్లు రాబట్టింది. ఇక ఇవ్వాల లేదా రేపటిలోగా ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్లను రాబడుతుందని స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఒడియ బామ్మ రితిక నాయక్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది. తన నటనకు, తన అమాయకత్వానికి, తన అందానికి తెలుగు కుర్ర కారు డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఈ చిత్రం… యాక్షన్ అండ్ డివోషనల్ గా ఉండడంతో.. మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. తేజ సజ్జ తన ఖాతాలో మరొక సూపర్ హిట్ ను వేసుకున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ సినిమా చివరిగా ఎన్ని కోట్ల కలెక్షన్లను రాబడుతుందో వేచి చూడాల్సిందే.
Read also : విలన్ పాత్రకు మంచు మనోజ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?