
చౌటుప్పల్ ,క్రైమ్ మిర్రర్ న్యూస్ ప్రతనిధి:- బ్యాంకులో డబ్బులు తీసుకునేందుకు వెళ్లిన మహిళ ఆచూకీ తెలియకుండాపోయింది. చౌటుప్పల్ మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై బుధవారం మిస్సింగ్ కేసు నమోదైంది. చౌటుప్పల్ సిఐ మన్మథ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన దేశగోని మల్లేష్ చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని వలిగొండ రోడ్డులో హెచ్ఎండిఏ వెంచర్ లో నివాసం ఉంటున్నాడు. అతను వృత్తిరీత్యా పంచాయతీ కార్యదర్శి గా జీవనం సాగిస్తున్నాడు. అతను 25న ఉదయం 8 గంటలకు తన వ్యక్తిగత పనిమీద నల్గొండకు వెళ్ళాడు. మధ్యాహ్నం 02:20 గంటలకు తన భార్య దేశగోని అలివేలు అలియాస్ అంజలి (34), కి ఆమె భర్త మల్లేష్ ఫోన్ చేయగా అతని కుమారుడు అర్జున్ దగ్గర ఉందని తెలిపాడు.
Read More : సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్టు
తండ్రి తన తల్లి గురించి ఆరా తీయగా వారి కుమారుడు అర్జున్ తన తల్లి తనను అమ్మమ్మ ఇంట్లో దిగబెట్టి బ్యాంకుకు వెళ్లి తిరిగి వస్తానని చెప్పిందని తండ్రితో చెప్పాడు. అదే సమయంలో తన ఫోను తన దగ్గర వదిలేసిందని తండ్రితో చెప్పాడు. మంగళవారం మధ్యాహ్నం బ్యాంకులో డబ్బుల కోసం వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లిన తన భార్య తిరిగి ఇంటికి రాకపోవడంతో దీంతో ఆందోళన చెందిన మల్లేష్ చుట్టుపక్కల, తెలిసిన బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో భర్త మల్లేష్ పోలీసులను ఆశ్రయించాడు. దేశగోని మల్లేష్ బుధవారం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సిఐ మన్మథ కుమార్ తెలిపారు. భర్త మల్లేష్ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే 871266 2744, 8712662481 నెంబర్ల కు సమాచారం అందించగలరని సి ఐ తెలిపారు.
Read More : తెలుగు రాష్ట్రాల్లో రేపే ఎమ్మెల్సీ ఎన్నికలు – గెలుపు ఎవరిదో..?