
బాలీవుడ్ బుల్లితెరపై సూపర్ డూపర్ హిట్ అయిన బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో సీజన్ 19 త్వరలోనే ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. దీంతో మరో 14 రోజుల్లో బిగ్ బాస్ 19వ సీజన్ గ్రాండ్ గా మొదలుకానుంది. అయితే బిగ్ బాస్ షో ప్రారంభమయ్యే గడువు దగ్గర పడుతున్నప్పటికీ ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు మాత్రం ఎవరనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది.
అయితే బిగ్ బాస్ 19వ సీజన్ కి ఎవరూ ఊహించనటువంటి ఓ స్పెషల్ గెస్ట్ ని నిర్వాహకులు కంటెస్టెంట్ గా తీసుకురాబోతున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన పెహల్గాం ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన హిమాన్షి నర్వాల్ ను కంటెస్టెంట్ గా తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సెంటిమెంటల్ మరియు ఎమోషనల్ విషయాలను ఆడియన్స్ కి తెలియజేసేందుకు షో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అయితే ఈ విషయంపై ఇప్పటివరకు బిగ్ బాస్ షో నిర్వాహకులు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం ఈ విషయం గురించి బాగానే చర్చించుకుంటున్నారు. మరి ఈ వార్తలు నిజం ఎంతుందో తెలియాలంటే మేకర్స్ స్పందించాల్సిందే.ఈ విషయం ఇలా ఉండగా ఏప్రిల్ 22వ జరిగిన పెహల్గాం టెర్రర్ అటాక్ లో పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాదులు దాదాపుగా 26 మంది భారతీయులను దారుణంగా కాల్చి చంపారు. ఈ క్రమంలో కేవలం హిందువులను మాత్రమే కిరాతకంగా హతమార్చారు. అయితే ఓ ముస్లిం టెర్రరిస్టుల నుంచి హిందువులను కాపాడేందుకు ప్రయత్నించగా అతడిని కూడా కాల్చి చంపారు. ఆ తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి దాదాపుగా వందమందికి పైగా టెర్రరిస్టులను హతమార్చింది. అంతేకాకుండా ఉగ్రవాద కార్యాలయాలను కూడా ధ్వంసం చేసింది.