
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలు నగరంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఒంగోలు ప్రజలకు కంటిమీద కునుకు ఉండడం లేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒంగోలు నగరంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ దొంగతనాలతో నగరంలోని ప్రజలందరూ చాలా భయపడుతున్నారు. కేవలం ఒక్క శనివారం రాత్రి రెండు చోట్ల భారీ చోరీలు జరిగాయి. మరోవైపు పేర్ని మిట్ట సమీపంలో ఉన్నటువంటి ఓ పప్పు మిల్లులో భారీ దొంగతనం జరిగింది. పప్పు మిల్లు ఆఫీస్ తాళం పగలగొట్టి ఏకంగా 2 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లడం జరిగింది. ఇక మరోవైపు ముంగమూరు రోడ్డు జంక్షన్ లోని ఓ బార్ షట్టర్ తాళం పగలగొట్టి మరి పదివేల రూపాయలను, 25 ఫుల్ బాటిల్ల మద్యం ను మాయం చేసేశారు. ఇక పశ్చిమ ప్రకాశం జిల్లాలోనూ కూడా ఇలాంటి చోరీలు జరిగిన వార్తలు ప్రతి రోజు ప్రజలకు కంటపడడంతో అధికారులు వీటిపై నిఘాలు పెట్టాలని అక్కడున్నటువంటి ప్రజలు కోరుతున్నారు. ప్రతి గ్రామంలోనూ కొన్ని సీసీ కెమెరాలును అమర్చాలని కోరుతున్నారు. దొంగతనాలు చేసేటువంటి వాళ్లను ఊరికి వదిలి పెట్టవద్దని పోలీసులకు ప్రజలు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు.. రేయింబవళ్లు కష్టపడి సంపాదించిన డబ్బును ఇలా సులభంగా దోచుకుని వెళ్తే మేము ఎలా బ్రతకాలి అని.. ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దొంగతనాలు జరుగుతున్న కారణంగా.. ప్రతి ఒక్కరు కూడా మా ఇంట్లో ఎక్కడ జరుగుతుందో అని.. భయపడుతూనే సరిగా నిద్రపోవడం కూడా మానేస్తున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అధికారులు… అన్ని ఏరియాలలో కూడా నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు పోలీసు వారిని కోరుతున్నారు.
టెస్ట్ క్రికెట్ మజాని ఇస్తుంది… ఆఖరి టెస్ట్ లో విజయం సాధించి డ్రాగ ముగిస్తాం : కెప్టెన్ గిల్
మానవత్వానికి మచ్చ: అక్రమ సంబంధం కోసం బస్టాండ్‌లో పేగుబిడ్డను వదిలేసిన తల్లి