
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- బాలకృష్ణ మరియు బోయపాటి దర్శకత్వంలో వచ్చినటువంటి అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద తెగ సందడి చేస్తుంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో కలెక్షన్లలో కూడా దూసుకుపోతుంది. ఈ సినిమాలో ప్రతి ఒక్కరి నటన ఓకెత్తు అయితే బాలకృష్ణ కూతురుగా నటించినటువంటి హర్షాలి మల్హోత్రా నటన మరో ఎత్తు. అయితే కనీసం 18 సంవత్సరాలు నిండని ఈ అమ్మాయి నటనలో మాత్రం అద్భుతంగా నటిస్తుంది. ఈ సినిమాలో బాలకృష్ణ కూతురిగా అదే కాకుండా ఆమె ఐక్యూ 226, 17 ఏళ్లకే DRDO సైంటిస్ట్ అని ఓవర్ చేసి చూపించడం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపోయేలా చేసింది. ప్రస్తుతం ఈమెపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున మీమ్స్ కూడా వస్తున్నాయి.
Read also : మందుల చీటీ స్పష్టంగా రాయాల్సిందే.. నేషనల్ మెడికల్ కమిషన్ కీలక నిర్ణయం?
ఇక ఈ అమ్మాయి లైఫ్ గురించి తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు. ముంబైలో జన్మించిన ఈ అమ్మాయి చిన్నతనం నుంచే నటనపై మక్కువతో కేవలం నాలుగేళ్ల వయసులోనే తల్లిదండ్రుల సహాయంతో సీరియల్స్ లో అడుగుపెట్టింది. ఇక ఆ తర్వాత ఏడేళ్ల వయస్సు ఉన్నప్పుడు సల్మాన్ ఖాన్ “భజరంగీ భాయిజాన్” మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు పొందింది. ఆ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చి పూర్తిగా చదువు మీద దృష్టి పెట్టింది. 2017 తర్వాత యాక్టింగ్ నుంచి పూర్తిగా బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటిఫుల్ బామ్మడు దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ బాలకృష్ణ అఖండ 2 సినిమాతో రీ ఎంట్రీ అనేది ఇచ్చారు. ఈ అమ్మాయి గురించి మన రెండు తెలుగు రాష్ట్రాలకు పూర్తిగా తెలియకపోయినా బాలీవుడ్ లో మాత్రం ఈ హీరోయిన్ కు మంచి పేరు, క్రేజ్ ఎక్కువగానే ఉంది.
Read also : శబరిమలకు పోటెత్తుతున్న భక్తులు.. రికార్డు స్థాయిలో దర్శనాలు?





