
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- మన భారతదేశంలో ఎక్కడైనా సరే ఏదైనా వ్యాధితో బాధపడుతున్న లేదా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగిన… వెంటనే ప్రైవేట్ ఆసుపత్రి నే నమ్ముకుని అందులో జాయిన్ అవుతున్నారు. వేల రూపాయలు ఖర్చయినా కూడా ప్రైవేట్ ఆసుపత్రి నే నమ్ముతుంటారు. ప్రభుత్వ ఆసుపత్రులపై రోజురోజుకీ కూడా నమ్మకం తగ్గిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే చాలానే కారణాలు ఉన్నాయి.
1.ప్రభుత్వాసుపత్రులలో ఆపరేషన్ చేయడానికి సరైన పరికరాలు, వసతులు లేకపోవడం
2.వేలవేల రూపాయలు జీతం తీసుకుంటున్న డాక్టర్లు సరైన సమయంలో ఆసుపత్రిలో ఉండకపోవడం
3. ఆసుపత్రిలోని వైద్యులు, నర్సులు సక్రమంగా బాధ్యతలను నిర్వహించకపోవడం
వంటి కారణాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడానికి సామాన్య ప్రజలు కూడా చాలా భయపడుతున్నారు. ఎంత డబ్బు అయినా లెక్క చేయకుండా ప్రైవేట్ ఆస్పత్రిలోనే జాయిన్ అవుతున్నారు.
జగన్ ప్రవేశపెట్టబోతున్న యాప్ పై.. మంత్రి సత్య కుమార్ యాదవ్ సెటైర్స్!
అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ ప్రాంతంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలతో రోగి పోరాడుతుంటే.. డాక్టర్ మాత్రం చక్కగా ఏసీ వేసుకొని నిద్రపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం తగ్గిపోవడానికి చెప్పేందుకు ఇది ఒక పూర్తి ఉదాహరణగా మారుతుంది. మీరట్ ప్రాంతంలో తీవ్రంగా గాయపడిన సునీల్ అనే వ్యక్తిని కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ భూపేష్ చక్కగా ఏసి వేసుకొని దర్జాగా నిద్రపోతున్నారు. గాయపడిన సునీల్ భార్య చంటి బిడ్డని ఎత్తుకొని అతడిని నిద్రలేపేందుకు ప్రయత్నించగా ఆ డాక్టర్ స్పందించలేదు. దీంతో గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సునీల్ తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలను వదిలాడు. దీంతో ఈ విషయాన్ని అధికారులు వద్దకు తీసుకువెళ్లగా ఆ డాక్టర్ను వెంటనే సస్పెండ్ చేశారు.
నెమ్మదిగా పెరుగుతున్న వరద.. నదిలో ప్రయాణించవద్దని హెచ్చరికలు!