ప్రయాగ్‌రాజ్‌లో 2025 మహా కుంభమేళా సందర్భంగా సోషల్ మీడియాలో విశేషమైన పాపులారిటీ పొందిన మోనాలిసా ఇప్పుడు మాస్ మీడియా చర్చలకు కేంద్రబిందువైంది. సహజ సౌందర్యం, తేనే కళ్ళతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఆమె వీడియోలు, ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఈ అవకాశంతో ఆమెకు హిందీ సినిమా అవకాశాలు తెచ్చాయి. మరోవైపు పలు సాంగ్స్, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్, పబ్లిక్ ఈవెంట్స్ ద్వారా బిజీగా గడిపింది. తాజాగా, కేరళకు చెందిన తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకోవడం ద్వారా వ్యక్తిగత జీవితంలో కొత్త మలుపు తీసుకుంది. గుడిలో జరిగిన వివాహం నిరాడంబరంగా జరిగింది. అయినప్పటికీ దేశవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ పెళ్లిపై కొంతమంది ఫర్మాన్‌పై లవ్ జిహాద్ ఆరోపణలు కూడా చేశారు.
ఈ వివాహం సోషల్ మీడియాలో చర్చకు కేంద్రంగా మారింది. మోనాలిసా, ఫర్మాన్ ఇప్పటికే మీడియాతో సమావేశం నిర్వహించి వివిధ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కానీ, ఈ వివాహంపై ఇరువైపుల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేయడం లేదు. ఫర్మాన్ తల్లిదండ్రులు, మోనాలిసా తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా, మోనాలిసా తల్లి వీధిలో కూర్చుని తన కూతురిని అప్పగించాలని వేడుకుంటూ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆమె పదిరోజులుగా తన కూతురు మాట్లాడకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“నా కూతురికి మొబైల్ ఫోన్ లేదు. నేను ఆమెతో ఎలా మాట్లాడగలను? ఆమె ఇంకా మైనర్. ఏమీ అర్థం చేసుకోదు. దయచేసి ఆమెను తిరిగి తీసుకురండి. లేకపోతే నేను ఏదైనా తిని చచ్చిపోతాను. నా కూతురిని చూడాలని మాత్రమే కోరుకుంటున్నాను” అని మోనాలిసా తల్లి స్థానిక పత్రికలకు తెలిపింది. తన కూతురి ఫోన్ కాల్స్‌కు సమాధానం రానందున, తల్లి ఆవేదన తీవ్రంగా పెరిగింది. ఈ పరిస్థితి మోనాలిసా పై సోషల్ మీడియాలో విమర్శలకు దారి తీస్తోంది.
ALSO READ: రా చూసుకుందాం.. నడి రోడ్డుపై బంటి vs టైగర్ (VIDEO)
