
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతుంది. తాజాగా మరో వ్యక్తిపై పులి దాడి చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో ఆ ప్రాంతంలోని ఎన్నోసార్లు చిరుత దాడి చేసిన సంఘటనలు చూశాం. అలాగే అలిపిరి మెట్లపై కూడా ఎన్నోసార్లు చిరుత దాడి చేయడం కళ్ళారా చూశాం. కొన్ని సందర్భాలలో ప్రాణాలు కోల్పోయిన వార్తలు కూడా చూశాం. అయితే తాజాగా మరోసారి తిరుపతిలో చిరుత సంచారం కలకలం రేపడం.. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కంటి నిండా నిద్ర కూడా పోలేకపోతున్నారు. తాజాగా జరిగిన ఘటనను చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సెప్టెంబర్ 25న టాలీవుడ్ షేక్ అవుబోతుంది!.. కారణం ఇదే?
తిరుపతిలోని జూ పార్కు రోడ్డులో బైక్ పై వెళ్తున్న వ్యక్తిపై చిరుత భయంకరమైన దాడి చేసింది. రోజులానే అమార్గంలో బైక్ పై వెళుతున్న వ్యక్తిపై… అనుకోకుండా పొదల్లో నుంచి వచ్చి దాడి చేయడం జరిగింది. అయితే అతడు బైక్ ను వేగంగా నడపడంతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. వెంటనే ఆ చిరుత పులి.. బైక్పై వెళ్తున్న వ్యక్తి దొరకకపోవడంతో వెంటనే అడవిలోకి పరుగులు తీసింది. లేదంటే బైక్పై వెళ్తున్న వ్యక్తి మరణ వార్తను ఈరోజు మనం పేపర్ లో చదువుతూ ఉండేవాళ్ళం. ఇదంతా కూడా వెనకాలే వస్తున్నటువంటి కార్ డాష్ కామ్ లో రికార్డు అయింది. లేదంటే ఆ వ్యక్తి పోలీసులకు చెప్పినా కూడా నమ్మేవారు కాదు. జరిగిన సంఘటన మొత్తం కూడా రికార్డ్ అవడంతో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు అలాగే అధికారులకు తెలియజేశారు. రాత్రి 12 గంటల సమయంలో జూ పార్క్ దగ్గరలో ఉన్నటువంటి అరవింద్ ఆసుపత్రి వద్ద చిరుత పులి కనిపించిందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు భయపడిపోయి అధికారులకు తెలియజేశారు. వెంటనే ఫారెస్ట్ అధికారులను రప్పించి… చుట్టుపక్కల ప్రాంతాలలో భద్రతను ఏర్పాటు చేయాలని అధికారులను స్థానికులు కోరారు.
అమెరికాలో తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం