
A Huge Encounter: దేశ భద్రతకు ఏళ్లుగా సవాలుగా నిలుస్తున్న మావోయిస్టు కార్యకలాపాలను నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపడుతున్న విస్తృత ఆపరేషన్లు వేగం పెంచుకున్నాయి. ఇప్పటికే అగ్రశ్రేణి నాయకులు సహా పలువురు మావోయిస్టులు వరుసగా లొంగిపోవడం, మరికొందరు ఎన్‌కౌంటర్లలో హతమవ్వడం వల్ల మావోయిస్టు మౌవ్‌మెంట్ తీవ్ర బలహీనతకు గురవుతూ ఉంది. ఈ నేపథ్యంలో చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతం మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది.
బుధవారం తెల్లవారుజాము నుంచే దంతెవాడ-బీజాపూర్ అరణ్యంలో భద్రతాదళాలు, మావోయిస్టులు ఎదురుపడటంతో తీవ్రమైన ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. గంటల తరబడి సాగిన ఈ ఆపరేషన్‌లో మావోయిస్టులు తిరుగుబాటుగా దాడులు చేయడానికి ప్రయత్నించినా, భద్రతా దళాల గట్టి ప్రతిఘటనను తట్టుకోలేకపోయారు. చివరకు ఈ ఘర్షణలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు ధైర్యవంతమైన జవాన్లు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఘటనాస్థలంలో భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇది మావోయిస్టుల కార్యాచరణపై మరొక పెద్ద దెబ్బగా పరిగణించవచ్చు.
ALSO READ: Viral video: కొండచిలువ vs మెుసలి.. ఎవరు గెలిచారో మీరే చూడండి..





