క్రైమ్ మిర్రర్, ఆదిలాబాద్ :-
హవ్వ… ఆదిపత్య వర్గంలో జన్మించిన వ్యక్తికి దళితుడని సర్టిఫికెట్ ఇస్తారా ?
ఇచ్చారేపో అనుకో… అర్హుడైన దళితుడికి దక్కాల్సిన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కట్టబెడతారా ??
దళితుల్ని మోసం చేసి అందలమెక్కిన ఆ ఉన్నతాధికారిపై చర్యలేవి?!, తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలి… కఠినంగా శిక్షించాలి
కడజాతి సామాజిక వర్గ సిబ్బందిపై జులుం… హక్కులను గురించి అడిగితే టార్చర్ చేస్తున్నాడని కార్యాలయ సిబ్బంది గగ్గోలు
బయటికి పొక్కిన అసలు నిజం.. కుల విభజన నేపథ్యంలో సదరు అధికారి అసలు రహస్యం బట్టబయలు
ఉన్నత అధికారులకు పిర్యాదు, ఆర్టిఐ ద్వారా ప్రశ్నలు..!?
సమగ్ర విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలంటున్న – తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షులు వైద్యనాథ్..
ఆనంద్ కుమార్ నేత (క్రైమ్ మిర్రర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో)
నకిలీ దళిత కుల ధ్రువీకరణ పత్రంతో ప్రభుత్వ ఉద్యోగం పొంది, జిల్లా వ్యవసాయ అధికారిగా చలామణి అవుతున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో ఉన్నత సామాజిక వర్గంలో జన్మించిన సదరు జిల్లా అధికారి, నకిలీ కుల ధ్రువీకరణ పత్రం ఆధారంగా ఉద్యోగం సంపాదించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. న్యాయంగా దళితులకు దక్కాల్సిన ప్రభుత్వ ఉద్యోగాన్ని తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం తో పొందిన అధికారిపై సస్పెండ్ చేసి సమగ్ర విచారణ జరిపించాలని దళిత సంఘాల నేతలు కోరుతున్నారు.
ఒక పక్క నకిలీ కుల ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం సంపాదించిన సదరు ఉన్నతాధికారి
తన కార్యాలయంలో పని చేసే కింది స్థాయి సిబ్బందితో పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నాడని విమర్శలను మూటగట్టుకున్నాడు. నకిలీ దళిత సర్టిఫికెట్ తో ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించిన సదరు అధికారిపై వర్గాలకు చెందిన కిందిస్థాయి సిబ్బందిని మానసికంగా వేధిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళిత కులాల జాబితాలో పత్తాలేని కులం పేరుతో అతగాడు కుల ధ్రువీకరణ పత్రాన్ని సంపాదించి ఎస్సీ రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాన్ని పొందిన సదరు అధికారికి, నకిలీ కుల ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించింది ఇచ్చింది ఎవరు.. అతనికి అండగా ఉన్నది ఎవరు అన్నది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆధిపత్య కుల సామాజిక వర్గంలో పుట్టి, దళిత కార్డుతో విద్యా, ఉద్యోగం సాధించిన అతడి గాడి తీరు పై సంబంధిత కార్యాలయ సిబ్బంది తో పాటు జిల్లాలోని దళిత ఉద్యోగులు ఆగ్రావేశాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆ పొరుగు రాష్ట్ర అధికారి తీరు ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలోను చర్చనీయాంశంగా మారింది. కడజాతి కుల ధ్రువీకరణ తీసుకొని పత్రాన్ని సంపాదించి, ఇల్లీగల్ గా ఉద్యోగం సాధించిన ఆ అధికారి, అదే కడజాతి సిబ్బందిపై చూపుతున్న వివక్షపై దళిత ఉద్యోగులు కన్నెర్ర చేస్తున్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో పని చేస్తున్న దళిత సామాజిక వర్గానికి సిబ్బంది ,ఆ అగ్రికల్చర్ అధికారి వేధింపులను తాళలేక పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే తమని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను సదరు ఉన్నతాధికారి ఉద్దేశ పూర్వకంగా వేధిస్తున్న తీరును అతడిపైన ఉండే ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. నకిలీ కుల ధ్రువీకరణ పత్రం ద్వారా ఉద్యోగాన్ని సంపాదించడమే కాకుండా, కార్యాలయంలోని దళిత ఉద్యోగులను వేధిస్తున్నారన్న ఆరోపణలు లెక్కకు మించి వినిపిస్తున్నప్పటికీ, పైస్థాయి అధికారులు అతడిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని దళిత సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. సదరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కులాన్ని తెలియజేయాలని కోరుతూ, ఆర్టీఐ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతోమంది ధరఖాస్తులు చేశారని, సత్వరమే ప్రభుత్వం స్పందించి నిజాలను బహిర్గతం చెయ్యాలని వారు కోరుతున్నారు.. ఇదే కాక తన సర్వీస్ రిజిస్టర్ ని సైతం, స్వదస్తూరితో రాసినట్లు, రికార్డులను ట్యాంపరింగ్ చేసినట్లు సమాచారం..? జిల్లా కలెక్టర్ కి సమాచారం లేకుండా, తన పరిధి దాటి వ్యవహరిస్తున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సదరు అధికారిపై సమగ్ర విచారణ జరిపించాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. సదరు ఉన్నతాధికారి వేధింపులతో ఇబ్బంది పడుతున్న ఎస్సి, ఎస్టి, ఉద్యోగులు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. , విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు..
పూర్తి వివరాలతో మరో క్రైమ్ మిర్రర్ కధనంతో మీ ముందుకు..
నిఘా వ్యవస్థ నిద్రిస్తే క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది..