
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ప్రసిద్ధి చెందినదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా టీటీడీ చైర్మన్ ఫోటోను వాట్సప్ డీపీ గా పెట్టుకొని శ్రీవారి భక్తులను మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీటీడీ చైర్మన్ పిఆర్ఓ అని చెప్పుకుంటూ శ్రీవారి సేవ టికెట్లు మరియు దర్శన టికెట్లు తీసిస్తానని భక్తులను మోసం చేస్తున్న ఫరూక్ ప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా టికెట్ల విషయంలో మోసపోయిన వ్యక్తి ఈ విషయాన్ని చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లగా ఈ వ్యవహారం బయటపడింది.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల వద్ద అప్పు చేసిన నాగబాబు?
చైర్మన్ ఆదేశంతో టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు పోలీసులకు ఆదేశాలు ఇవ్వగా విచారణ జరిపి ఇవాళ ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అధికారుల ఫిర్యాదు ఆధారంగా 318(4),319(2),66D పలు సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేశామని టూ టౌన్ పోలీసులు తెలిపారు. తిరుమల తిరుపతి సమాచారం అని వాట్సప్ గ్రూపుల ద్వారా భక్తులను మోసగిస్తున్నారని భక్తులు చాలామందికి ఈమధ్య పోలీసులకు కంప్లైంట్ లు ఇస్తున్నారు. ఇక నిందితుడు ప్రసాద్ దగ్గర నుంచి 80 వేల రూపాయల నగదు అలాగే ఆరు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం ప్రతి ఒకరికి తెలియడంతో టీటీడీ అధికారిక వెబ్సైట్ తప్పించి మరి ఇతర వెబ్సైట్లను.. దళారీలను నమ్మి మోసపోవద్దని భక్తులకు పోలీసులు సూచించారు.
శంకర్పల్లిలో బిజెపి లీడర్ బద్దం శాంబా రెడ్డి అనుమానాస్పద మృతి..