
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా నిన్న ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్న సందర్భంలో కేఎల్ రాహుల్ ఎంపైర్ ధర్మసేనపై తీవ్రంగా పైరయ్యారు. ఇంగ్లాండ్ బ్యాటర్ రూట్, భారత బౌలర్ ప్రసిద్ కృష్ణ మధ్య వాగ్వాదం జరగగా వెంటనే చొరవ తీసుకున్న కేఎల్ రాహుల్ బౌలర్ ప్రసిద్ కృష్ణకు అండగా వెళ్లారు. దీంతో వెంటనే ఎంపైర్ ధర్మసేన కేఎల్ రాహుల్ ను ఆపే ప్రయత్నం చేయడంతో ఎంపైర్ పై కేఎల్ రాహుల్ ఫైర్ అయ్యారు. గొడవ పడుతుంటే చూస్తూ ఊరుకోవాలా?… బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఇంటికి వెళ్ళమంటారా?… అని ఎంపైర్ ధర్మసేనను కేఎల్ రాహుల్ ప్రశ్నించారు.
Read also గ్రేట్ పిక్చర్.. సామాన్య మనుషులలా మంచాల పై చర్చిస్తున్న ప్రకాశం జిల్లా అధికారులు!
ఇదిలా ఉండగా భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కేఎల్ రాహుల్ బాల్ కూడా ఎడ్జ్ అయిందంటూ ఇంగ్లాండ్ ప్లేయర్లకు ఎంపైర్ ధర్మసేన హింట్ కూడా ఇచ్చారు. ఇంగ్లాండ్ రివ్యూ కోల్పోకుండా ఎంపైర్ ధర్మసేన హెల్ప్ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఇంగ్లాండ్ బౌలర్ టంగ్ వేసిన బాల్ సుదర్శన్ ప్యాడ్ లకు తాకడంతో.. ఇంగ్లాండ్ ప్లేయర్ లందరూ కూడా అప్పీల్ చేశారు. వెంటనే ధర్మసేన తల అడ్డంగా ఊపుతూ నాటౌట్ చెప్పడంతో పాటు బాల్ ఇన్సైడ్ ఎడ్జ్ అయిందని ఇంగ్లాండ్ ప్లేయర్లకు తెలిసేలా చేతులతో సిగ్నల్స్ ఇచ్చారు. దీంతో ఇంగ్లాండ్ ప్లేయర్లు కూడా రివ్యూ కు వెళ్లకపోవడంతో… ఒక రివ్యూ సేవ్ అయింది. దీంతో ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంపైర్ ధర్మసేనపై మండిపడుతున్నారు. అధర్మసేనా అని.. సోషల్ మీడియా వేదికగా ఇండియన్ ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read also : ‘డెడ్ ఎకానమీ’.. రాహుల్ కామెంట్స్ ను ఖండించిన శశిథరూర్!