
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- మంచు విష్ణు మరియు మోహన్ బాబు కీలక పాత్రలలో నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు సినిమా చాలా బాగుంది అని అంటూనే… శివుడి పాత్రలో నటించినటువంటి అక్షయ్ కుమార్ మరియు కాజల్ ని చూస్తుంటే చాలా ఇరిటేషన్ వచ్చిందని చెప్పుకొచ్చారు. సినిమా మొత్తంలో వీరిద్దరి పాత్రలు తప్ప మిగతా పాత్రలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. కన్నప్ప సినిమా చూస్తున్నంత సేపు నాకు గతంలో వచ్చినటువంటి ” అన్నమయ్య” సినిమా కాన్సెప్ట్ గుర్తుకు వచ్చిందని తెలిపారు. ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నటువంటి విష్ణు కూడా ఈ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యారని అన్నారు. సినిమా బాగున్నాందుకు తగిన ఫలితం మాత్రం దక్కలేదని తెలిపారు. కన్నప్ప సినిమాపై ఎంతోమంది భారీగా ట్రోల్స్ చేశారు. కానీ ఈ సినిమాకి ఎక్కడా కూడా ఎటువంటి బ్యాడ్ రిపోర్ట్ అయితే మాత్రం రాలేదు.
కన్నప్ప సినిమా తర్కెక్కించే విషయంలో ఫ్యాన్ ఇండియా రేంజ్ గురించి మాత్రమే దర్శకులు ఆలోచించారని అన్నారు. కానీ సినిమాలో పిక్ దగ్గరే రేంజ్ లో మాత్రం జాగ్రత్తలు తీసుకోలేదని… ఒకవేళ భక్తికి తగ్గట్టుగా కాన్సెప్ట్ ప్రధానంగా తీసుకుని ఉంటే ఈ సినిమా ఇవాళ బాక్స్ ఆఫీస్ వద్ద కచ్చితంగా వెయ్యికోట్ల వసూలు వచ్చే ఛాన్స్ ఉందని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 200 కోట్ల బడ్జెట్తో తరికెక్కిన ఈ సినిమా పది రోజుల్లో కేవలం 50 కోట్లు మాత్రమే రాబట్టడంతో మంచి వసూళ్లను అందుకోలేకపోయింది. దీంతో నిర్మాతగా వ్యవహరించినటువంటి మోహన్ బాబుకు భారీగా నష్టాలు వచ్చినట్లు సినిమా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
నా శాఖలన్నీ ఆగమాగం.. గందరగోళంగా ఉన్న శాఖలను ఇచ్చారు… మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు