
ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- భారత కమ్యూనిస్టు పార్టీ ఆత్మకూరు(ఎం)మండల కౌన్సిల్ సమావేశం పిఎస్ గార్డెన్ లో కూరెళ్ళ మచ్చగిరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా యానాల దామోదర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ భారత గడ్డపై CPI 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 18న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు సానుభూతిపరులు వేల సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. నాటి స్వాతంత్ర ఉద్యమం నుండి మొదలుకొని కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సాయుధ పోరాటంలో 4000 మంది మృతవీరులైనప్పటికీ వెనుకకు తగ్గకుండా సమరశీల పోరాటం నిర్వహించి నైజాం నవాబులు పారదోలడంలో కీలక పాత్ర పోషించిందని అన్నారు.
దున్నేవానికి భూమి, భూపోరాటాలు, భూదానాలు చేసి పేదల పక్షాన నిలిచిందని ఆయన అన్నారు.కార్మికుల కర్షకులు పక్షాన నిలిచి ప్రతినిత్యం ప్రజా సమస్యల మీద పోరాడుతూ అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా పోరాటాలు నిర్వహిస్తోందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చేడే చంద్రయ్య , జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పల ముత్యాలు, కుసుమాని హరిశ్చంద్ర, చేనేత సంఘం రాష్ట్ర నాయకులు పాసికంటి లక్ష్మీనరసయ్య, మండల కార్యదర్శి మారుపాక వెంకటేష్, సహాయ కార్యదర్శిలు ఎండి నయీమ్, బత్తిని నరేష్, మండల కార్యవర్గ సభ్యులు గుర్రం రాజమణి, జక్క దయాకర్ రెడ్డి , కసరబోయిన సత్తయ్య, కల్వల నరసయ్య, మారుపాక అంజయ్య, కౌన్సిల్ సభ్యులు మజ్జిగ నరసయ్య, సుల్తాన్ పురుషోత్తం, సోమనబోయిన నరసింహ, దుర్గపతి నరసయ్య, తాళ్లపల్లి నర్సయ్య, సుదగాని పృధ్విరాజ్, కొమ్ము కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.





