
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం 16 ఏళ్ల బాలుడితో లైంగిక సంబంధం పెట్టుకున్న ఆరోపణలపై 43 ఏళ్ల మహిళ మేరీ అబెరాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. బాలుడి కుటుంబానికి మేరీ అబెరాకు గతం నుంచే పరిచయం ఉండటంతో, ఈ వ్యవహారం మరింత కలచివేస్తోంది. నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ ఆమె ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

వివరాల్లోకి వెళ్తే.. ఆ బాలుడు మేరీ అబెరాతో కొంతకాలంగా సన్నిహితంగా మెలిగినట్లు విచారణలో తేలింది. ఈ పరిచయం క్రమంగా లైంగిక సంబంధంగా మారినట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరూ శారీరకంగా కలిసిన వీడియోలు బాలుడి ఫోన్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఈ వీడియోలను అనుకోకుండా బాలుడి తల్లి చూడడంతో అసలు విషయం బయటపడింది. తన కుమారుడి ఫోన్‌లో ఉన్న దృశ్యాలను చూసి ఆమె తీవ్రంగా కలత చెందింది.
ఈ ఘటన తన కుమారుడి బెడ్‌రూమ్‌లోనే జరిగిందని బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలుడిని, కుటుంబ సభ్యులను విచారించి, ఫోన్‌లో ఉన్న వీడియోలను ఆధారాలుగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మేరీ అబెరాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, ఆరోపణలకు సంబంధించిన కీలక వివరాలు బయటకు వచ్చాయి. బాలుడు మైనర్ కావడంతో, చట్టపరంగా ఇది తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
మైనర్లపై లైంగిక దాడులు, దుర్వినియోగం వంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఫ్లోరిడా పోలీసులు హెచ్చరించారు. బాధిత బాలుడికి మానసికంగా కౌన్సెలింగ్ అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మేరీ అబెరాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచేందుకు సిద్ధమవుతున్నారు.
ALSO READ: భారత్ ఇక పేద దేశం కానే కాదు.. ఒక్క ఏడాదే 18 వేల బీఎండబ్ల్యూలు కొనేశారు మనోళ్లు!





