క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి ఈ సంవత్సరం భారీగా ఆదాయం వచ్చింది. ఈ సీజన్ అయ్యప్ప స్వామి భక్తులు ఎక్కువ సంఖ్యలో శబరిమలలోని అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మాల ధారణతో కొన్ని లక్షల మంది అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుని ముడుపులు, మొక్కులు తీర్చుకున్నారు. దీంతో ఈ సీజన్ కి సంబంధించి భారీగానే దేవాలయానికి ఆదాయం వచ్చినట్లు దేవాదాయ అధికారులు తెలియజేశారు. శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి ప్రస్తుతం మండలం – మకర విలక్కు సీజన్లో దాదాపుగా 440 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అధికంగా 90 కోట్లు వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు చైర్మన్ పిఎస్ ప్రశాంత్ వెల్లడించారు. గత సీజన్ కు సంబంధించి భక్తుల తరఫున దేవాలయానికి 354 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
అయితే ప్రతి సంవత్సరం కూడా సాధారణంగా నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు ఆదాయం పెరుగుతూనే ఉంటుందని తెలిపారు. కానీ ఈ ఏడాది మాత్రం భారీగా ఆదాయం పెరిగిందని దేవస్థానం బోర్డు వెల్లడించింది. దీంతో శబరిమల అయ్యప్ప స్వామి పై భక్తులు ఎంత విశ్వాసం గా ఉన్నారో అర్థమవుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి దాదాపుగా అయ్యప్ప మాలలు ధరించి భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ సమయంలోనే స్వామివారికి ముడుపులు చెల్లించి కానుకలుగా కొంత డబ్బును హుండీలలో వేస్తుంటారు.
ఇది కూడా చదవండి
1. త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించిన ప్రధాన మంత్రి?