గుజరాత్ రాజధాని అయినటువంటి గాంధీనగర్ లో ఒక సినిమా లాంటి వార్త ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. ఏకంగా 9 సంవత్సరాల నుండి నకిలీ కోర్టును ఏర్పాటు చేసి జడ్జి లాగా తీర్పులిస్తూ సినిమా తరహాలో మోసం చేసిన వ్యక్తి ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్ట్ లో ప్రవేశపెట్టారు.
ఇక అసలు విషయానికి వస్తే మోరిస్ శామ్యూల్ అనే క్రిస్టియన్ వ్యక్తి గుజరాత్ రాజధాని అయినటువంటి గాంధీ నగర్ లో షాపింగ్ సెంటర్ లో ఏకంగా కోర్టు లాగా డెకరేషన్ చేసి తొమ్మిది ఏళ్లు నుండి జడ్జిగా తీర్పులు ఇస్తూ పోలీసులకు దొరుకుపోయాడు. అప్పుడప్పుడు న్యాయం తరఫున ఉన్నటువంటి సభ్యుల నుండి భారీ మొత్తంలో డబ్బులు కూడా తీసుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
ఇక పోలీసులు తీసుకెళ్లి కోర్టులో హాజరుపరచగా అక్కడ న్యాయమూర్తి ఎందుకిలా చేశావని అడిగాడు. దాంతో అతను నేను ఒక మధ్యవర్తి న్యాయమూర్తి అని నాకు న్యాయ శాస్త్రంలో పిహెచ్డి ఉందని చెప్పుకొచ్చాడు. అయితే పోలీసులు నన్ను నిజం ఒప్పుకోవాలని విపరీతంగా కొట్టారని చెప్పుకొచ్చాడు. దీంతో న్యాయస్థానం అతనిని వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి కోర్ట్ కి సబ్మిట్ చేయాలనీ కోరారు. ఇక తరువాత అన్ని న్యూస్ చానెల్స్ కూడా అతన్ని పెద్ద ఎత్తున ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.