గుండెపోటుతో ఎనిమిదేళ్ల చిన్నారి మరణించిన సంఘటన కర్ణాటక లో జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని చామరాజ నగర్ లో సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నటువంటి తేజస్విని అనే 8 ఏళ్ల చిన్నారి ఒక్కసారిగా గుండెపోటుతో మరణించింది. చాలాసేపు తోటి విద్యార్థులతో ఉత్సాహంగా గడిపిన తేజస్విని ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయి పడిపోయింది.
Read More : మేం తలుచుకుంటే కాంగ్రెస్ ఆఫీస్ ను తగలబెట్టేస్తాం : రాజాసింగ్
ఇక ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు అప్రమత్తమై వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆ చిన్నారి కన్ను మూసింది. గుండెపోటు కారణంగానే ఆ చిన్నారి మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ ఎనిమిదేళ్ల చిన్నారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎంతో ఉత్సాహంగా నవ్వుకుంటూ పాఠశాలకు వెళ్లిన ఆ చిన్నారి మరణ వార్తను వినగానే తల్లిదండ్రులు కంటతడి పెట్టుకున్నారు.
Read More : ఘోరంగా కొట్టుకున్న బిజెపి మరియు కాంగ్రెస్ నాయకులు
అయితే ఈ విషయం తెలియగానే జిల్లా విద్యాశాఖ అధికారి హనుమంత శెట్టి పాఠశాలకు చేరుకొని 8 ఏళ్ల చిన్నారి తేజస్విని ఎలా చనిపోయిందనే ఘటనపై ఆరా తీశారు. పాప యొక్క ఆరోగ్య స్థితిగతుల గురించి తల్లిదండ్రులను అడగగా, ఆ పాప తల్లిదండ్రులు మా పాపకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తెలిపారు. ఇక జిల్లా విద్యాశాఖ అధికారి పోలీసులకు ఈ కేసును అప్పగించారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Read More : భారీగా పెరుగుతున్న చైనా వైరస్ కేసులు.. గాంధీ హాస్పిటల్ రెడీ
ఏది ఏమైనా సరే ఈమధ్య గుండెపోటు కారణంగా అనేకమంది మరణిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రతిరోజు కూడా గుండెపోటు కారణంగా కొన్ని పదుల సంఖ్యలలో మరణాలు మనకి వినిపిస్తున్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు గుండెపోటు పై అవగాహన కల్పిస్తూ చాలామంది డాక్టర్లు అలాగే ప్రభుత్వ అధికారులు సూచనలు చేస్తూ ఒక అవగాహన అయితే కల్పిస్తున్నారు.