
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్రంలోని ఎస్ ఎల్ బి సి టన్నెల్ కథ విషాదంతంగా ముగిసింది. దాదాపు వారం రోజులు పాటుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించిన కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ లోపల చెక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు కూడా మృతి చెందినట్లు రెస్క్యూ బృందం శుక్రవారం ప్రకటించింది. దాదాపు మూడు మీటర్ల లోతులో మృతదేహాలు ఉన్నాయని… అత్యాధునిక పరికరాలతో రెస్క్యూ టీం గుర్తించినట్లు సమాచారం అందింది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే అప్పుడే టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ఘటనపై ఓ క్లారిటీ రానుంది.
Read More : రూ.48,340 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్ – 15శాతం వృద్ధే లక్ష్యమన్న మంత్రి అచ్చెన్నాయుడు
ఇక దాదాపుగా 35 కిలోమీటర్ల మేర టన్నెల్ పనులు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ టన్నెల్ నిర్మాణం త్వరగా పూర్తిచేసి రాష్ట్రంలోని ప్రజలకు మరియు పంటలకు సాగునీరు మరియు తాగునీరు అందించాలని పనులు వేగవంతం చేస్తుంది. ఫిబ్రవరి 22వ తారీఖున ఉదయం 14వ కిలోమీటర్ల వద్ద పై కప్పు కూలిపోవడంతో విషాదం నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో టన్నెల్ పై కప్పు కూలిపోవడం జరిగింది. నల్గొండ జిల్లాలోని మొగుడు పాయింట్ అయిదు లక్షలు ఎకరాలకు అలాగే 100 గ్రామాలకు తాగు నిరం అందించేందుకు ఎస్ఎల్ బిసి టన్నెల్ ప్రాజెక్టు 2005లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించారు. దాదాపుగా మొత్తం 44 కిలోమీటర్ల ప్రాజెక్టు చేపట్టగా ఇది వరకే పలుమార్లు కొన్ని అనుకోని కారణాలవల్ల పనులు నిలిచిపోయాయి.
Read More : SLBC టన్నెల్ ను సందర్శించనున్న బిజెపి నాయకులు…
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ టన్నెల్ నిర్మాణం త్వరగా పూర్తిచేసి సాగునీరు మరియు తాగునీరు అందించాలని పనులను వేగవంతం చేసింది. ఫిబ్రవరి 18న ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు తిరిగి చేపట్టగా ఫిబ్రవరి 22న ఉదయం 14వ కిలోమీటర్ వద్ద పై కప్పు కూలిపోవడంతో విషాదం నెలకొంది.