
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మీరాఖాన్ పేటలో ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరారు. ఏ సమస్యలు ఉన్నా… ఎన్ని సమస్యలున్నా కూడా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ.. ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని ఆపడానికి ప్రయత్నాలు చేయకండి అని కోరారు. ఏ విధంగానూ ఫ్యూచర్ సిటీకి బ్రేకులు వేద్దామనే ఆలోచన ఏమి పెట్టుకోకండి అని సూచించారు. ఈ సందర్భంలో ఎన్నో అడ్డంకులు రావచ్చు… రాజకీయ పార్టీలు ఉసుగల్పితే చిక్కుల్లో పడకండి అన్నారు. అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పకొచ్చారు. కరెక్ట్ గా పదేళ్లు అవకాశం ఇస్తే న్యూయార్క్ తో పోటీపడేలా ఫ్యూచర్ సిటీని మన దగ్గర అభివృద్ధి చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఫ్యూచర్ సిటీలోనే సింగరేణికి దాదాపు 10 ఎకరాల భూమిని కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also : తొక్కిసలాటలో తప్పు ఎవరిది?… ఇండియాలోనే ఎందుకిలా జరుగుతుంది!
మన భవిష్యత్తు తరాల కోసమే ఈ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ రేవంత్ రెడ్డికి చాలా భూములు ఉన్నాయని.. అందుకే ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారని చాలామంది ఆరోపిస్తున్నారట. ఈ విషయంపై స్పందించిన రేవంత్ రెడ్డి నాకు ఈ ప్రాంతంలో భూములు ఉంటే ప్రతి ఒక్కరికి తెలుస్తాయి. అంతేకానీ దాచి పెడితే ఏది దాగదు అని.. వ్యాఖ్యానించారు. న్యూయార్క్ లో పనిచేసే ఇండియన్స్ కూడా ఇక్కడికి వస్తారని.. ఇంకా ఫారిన్ దేశాల వారు కూడా ఈ ఫ్యూచర్ సిటీలో వర్క్ చేసుకునే విధంగా చేస్తామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్యూచర్ సిటీ కి సహకరిస్తూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు.
Read also : తొలి ముడు రోజుల్లోనే రికార్డ్ కలెక్షన్స్… తన కెరీర్ లోనే మొదటిసారి!