క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్
ఆంధ్రప్రదేశ్ లోని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5న కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద జరగనున్న రాష్ట్రస్థాయి హైందవ శంఖారావం సభ కోసం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పరిషత్ రాష్ట్ర ప్రతినిధి దుర్గాప్రసాద్ తెలిపారు. ఎన్నడూ చూడని విధంగా విజయవాడకు సమీపంలో సుమారు 7లక్షల మందితో హైందవ శంఖారావం సభ జరగనుందని దిలీప్ పేర్కొన్నారు. ఇప్పటికే గ్రామాల్లో పరిషత్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించామన్నారు.
రెండు రోజులు ఎంజాయ్ చేయనివ్వండి.. కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి సెటైరికల్ కామెంట్స్
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాలు అలాగే పట్టణాలలో ఉన్నటువంటి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో అందరికీ కూడా సమాచారం అందజేశామని తెలిపారు. కంకిపాడు మండలం ఉప్పులూరు కు దాదాపుగా 15 రైళ్లు వస్తాయని చెప్పుకొచ్చారు. ఈ సభను ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం కాకుండా అన్ని జాగ్రత్తలతో ఎన్నడు జరగనటువంటి విధంగా జరిపిస్తామని తెలిపారు.
అడవి పందిని వేటాడిన మంచు విష్ణు!.. వీడియో బయటపెట్టిన మంచు మనోజ్!!
కాగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఈ హైందవ శంఖారావం సభకు రానున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి వీళ్ళ కోసం ప్రత్యేకంగా గ్రామాలలో వారికి వారే వాహనాలను పెట్టుకొని మరీ వచ్చేటువంటి అవకాశం ఉండడంతో భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సభ కమిటీ అధికారులు తెలియజేశారు.
దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు!… మరి రేవంత్ స్థానం?