పట్టణంలో హాట్‌టాపిక్ గా మారిన బీఆర్ ఎస్ నేత రాజ్‌కుమార్
హర్షం వ్యక్తం చేస్తున్న ఆలయ సిబ్బంది, ప్రజలు
పటాన్ చెరు, క్రైమ్ మిర్రర్: కన్న తల్లిదండ్రులు, పుట్టిన ఊరు నాకేమిచ్చిందని నిట్టూరుస్తున్న ఈ రోజుల్లో … కన్నవారు గౌరవం తెచ్చే విధంగా బ్రతకాలి. పుట్టిన ఊరుకు చేతనైయినంత వరకు సాయం చేయాలనే అనే దృఢ సంకల్పంతో బీఆర్ ఎస్ నేత, కాల్వగడ్డ రాజ్‌కుమార్ ముందుకు సాగుతున్నారు. రాజ్ కుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో స్వచ్చంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
పఠాన్ చెరువు నియోజకవర్గం, ముత్తంగి డివిజన్, కర్ధనూర్ గ్రామంలో పురాతన శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం ఎంతో ప్రాచీనమైనది. కాగా వందల ఏళ్ల చరిత్రకలిగినప్పటికి అభివృద్దికి నోచుకోక శిథిలాస్థలకు చేరుకుంది. దీంతో దాతల కోసంఆలయ సిబ్బంది, గ్రామస్తులు ఎంతో మందిని కలుస్తున్న సరైన స్పందన రాకపోవడంతో వారు గురయ్యారు. దీంతోఆలయ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
యూకేజీ నుండి 9 వ తరగతి వరకు చదివిన కర్దనూరు గ్రామం తనకు సొంత గ్రామం లాటిందని భావించి చరిత్ర కలిగిన సిద్ధి వినాయక ఆలయ పునర్నిర్మాణం కోసం గ్రామస్థులతో పాటు ఆలయ నిర్మాణం బాధ్యతలో నేను సైతం చేయికలుపుతానంటూ రాజ్ కుమార్ ఫౌండేషన్ చైర్మన్ కాల్వగడ్డ రాజ్ కుమార్ ముందుకొ ఏకంగా 50లక్షల విరాళాన్ని ప్రకటించి నియోజకవర్గంలోనే హాట్‌టాపిక్‌గా నిలిచారు. తక్షణమే ఆలయ పనులు మొదలు పెట్టాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులకు రాజ్ కుమార్ సూచించారు. రాజ్ కుమార్ తీసుకున్న నిర్ణయం పట్ల పార్టీలకు అతీతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆలయ సిబ్బంది, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
