
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-జగిత్యాల జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ల దగ్గర నుండి 5 ద్విచక్ర వాహనాలు, 5 సెల్ ఫోన్లు,ఒక కారు ను స్వాదీనం చేసుకున్నారు.జక్కుల గోపాల్, సింగం రాజు, నేరెళ్ల నరేష్, సంపత్ కుమార్ స్వామి, బుర్ర రాజేందర్ గా పేర్లను తెలిపారు. వీళ్ళు ఐదుగురు కూడా ఒక ముఠాగా ఏర్పడి రాత్రి వేళలో కలమడుగు నుంచి కారులో బయలుదేరి వివిధ గ్రామాల్లో ఇండ్ల ముందు పార్కు చేసిన బైకులు చోరీ చేస్తున్నారు.వీరంతా కలమడుగు, జన్నారం మండలం మంచిర్యాల జిల్లాకు చెందినవారుగా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వీరిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు డిఎస్పీ రఘు చందర్ తెలిపారు. కాగా రాష్ట్రమంతటా కూడా ఇప్పుడు చాలామంది వాహనాలను చోరీ చేస్తూ దొరికిపోతున్నారు. ఈ
తరుణంలోనే పోలీసులు కొన్ని నియోజకవర్గాల్లోని గ్రామాలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :-
1.నా నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటా : కోమటిరెడ్డి
2.కెసిఆర్ రంగంలోకి దిగితే… రేవంత్ రెడ్డి అయితే ఏంటయ్యా : హరీష్ రావు
3.క్రైమ్ మిర్రర్ ఎఫెక్ట్!..స్పందించిన ఫుడ్-సేఫ్టీ అధికారులు.. బేకరీ సీజ్?