Wednesday, March 4, 2026
Homeజాతీయంతొక్కిసలాట దెబ్బతో కొత్త రూల్స్ ప్రకటించిన UP ప్రభుత్వం!..!..

తొక్కిసలాట దెబ్బతో కొత్త రూల్స్ ప్రకటించిన UP ప్రభుత్వం!..!..

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో నిన్న తొక్కిసలాట జరిగి ఏకంగా 20 మందికి పైగా మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఇలాంటి ఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలను తీసుకుంది. తాజాగా మహా కుంభమేళాలో కొన్ని కొత్త రూల్స్ ను తీసుకువచ్చామంటూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇకనుండి మహా కుంభమేళాలో ఐదు రకాల కొత్త ఆంక్షలు విధించామని చెప్పి తెలిపారు.

డాక్టర్ నిర్లక్ష్యం!.. బలైన మహిళ నిండు ప్రాణం?

మహా కుంభమేళా జరిగే ఏరియాను నో పార్కింగ్, వెహికల్ జోన్ గా ప్రకటించింది. దీంతో మహా కుంభమేళాకు వెళ్లే వాహనాలను నిలిపివేయడం జరిగింది. మినహాయింపులు సహా VVIP పాస్ లు అలాగే వాహనాల ఎంట్రీలను కూడా నిలిపివేసినట్లు తెలిపింది. ఎటువంటి రద్దీలు, ఇబ్బందులు కలగకుండా భక్తులు సాఫీగా మహా కుంభమేళాలో స్వేచ్ఛగా తిరుగుతూ పుణ్యస్నాలను ఆచరించి క్షేమంగా ఇంటికి వెళ్లాలనే ఆలోచనతో వన్ వే ట్రాఫిక్ సిస్టం ను అమలు చేస్తుంది. దీంతో మహా కుంభమేళకు పొరుగు జిల్లాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల వద్దనే ఆపేస్తున్నారు. అంతేకాకుండా ఫిబ్రవరి 4వ తారీఖు వరకు ఫోర్ వీలర్ వాహనాలకు సిటీలోకి అనుమతి లేదని ప్రకటించింది. దీంతో మహాకుంభమేళాకు వెళ్లాలని అనుకునేవారు కచ్చితంగా ఈ విషయాలను మీ తోటి స్నేహితులకు అలాగే బంధుమిత్రులకు తెలియజేయండి.

రేవంత్ రెడ్డి పై తీవ్రంగా మండిపడ్డ ఎమ్మెల్యే!…

ఢిల్లీ గణతంత్ర పరేడ్ వేడుకలు!.. మూడో స్థానంలో నిలిచిన ఏపీ?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments