
– ద్రోణి ప్రభావంత గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు
– రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పుర్ :- తెలంగాణలో రానున్న నాలుగు రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యప్రదేశ్ నుండి కేరళ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు.
నేడు ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు.
పసలేదు కేసీఆర్ ప్రసంగం ఆత్మస్తుతి, పరనింద… కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోయడానికే సభ?
హస్తం పార్టీలో చెంపదెబ్బలు – ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన ఎంపీ