
-
సీఎస్‌ఆర్ పథకం కింద నిధుల సమీకరణ
-
గూగుల్-అమెజాన్ వంటి దిగ్గజాల సహకారం
-
ఇప్పటికే ప్రారంభమైన ప్రాథమిక పనులు!
-
చెరువుల పరిసరాలు హరితవనాలుగా అభివృద్ధి
-
ఆక్రమణలు, మురుగు కలవకుండా శాశ్వత చర్యలు
-
కాలుష్యానికి పాల్పడితే కఠిన చర్యలు
-
చెరువుల పునరుద్ధరణతో నగరానికి కొత్త ఊపిరి వస్తుందని ఆశాభావం
క్రైమ్ మిర్రర్, నిఘా: హైదరాబాద్ మహా నగరంలోని 30 చెరువులకు పూర్వ వైభవాన్ని తిరిగి అందించేందుకు హైడ్రా సంస్థ ముందుకొచ్చింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) పథకం కింద గూగుల్, అమెజాన్ వంటి బహుళజాతి సంస్థలు ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రాథమిక పనులు ప్రారంభమయ్యాయని సమాచారం.
పర్యావరణం, ప్రజల జీవన ప్రమాణాల అభివృద్ధే లక్ష్యంగా చెరువులు కేవలం జల నిల్వలు కాదు, అవి సమాజ శ్వాసలాంటివని హైడ్రా ప్రతినిధులు తెలిపారు. చెరువుల పునరుద్ధరణతోపాటు వాటి పరిసరాలను హరితవనాలుగా అభివృద్ధి చేయడం, వాక్‌వేలు, పార్కులు ఏర్పాటు చేయడం, బయోడైవర్సిటీ కాపాడడం వంటి చర్యలు ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా గూగుల్, అమెజాన్, ఇతర ఐటీ సంస్థలు తమ సామాజిక బాధ్యతగా నిధులు సమకూర్చుతున్నాయి. ప్రభుత్వం, ప్రైవేటు రంగం కలిసి నగరంలోని నీటి వనరులను రక్షించేందుకు చర్యలు చేపడుతున్నాయి.
దురుద్దేశాలకు తావులేదని చెరువుల చుట్టుపక్కల అక్రమ ఆక్రమణలు, మురుగునీటి ప్రవాహం వంటి చర్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని అధికారులు హెచ్చరించారు. చెరువులను వదిలిపెట్టబోమని స్పష్టంగా ప్రకటించారు. కాలుష్యానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ప్రజల సహకారం కోరిన అధికారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని అధికారులు తెలిపారు. చెరువులను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరి బాధ్యత కీలకమని, ఈ పునరుద్ధరణతో నగరానికి కొత్త ఊపిరి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: