రాజస్థాన్ లోని ఒక చిన్న పల్లెటూరులో చిన్నారి బోరు బావిలో పడడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. దాదాపుగా నా కూతురు బోరుబావిలో పడి ఆరు రోజులైంది అంటూ తన తల్లి ఆవేదన చెందుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఈ సందర్భంలోనే మీడియాతో మాట్లాడుతున్న ఆమె అధికారులపై తీవ్రంగా మండిపడింది.
నేడే ప్రో కబడ్డీ ఫైనల్స్!.. పాట్నా VS హర్యానా!.. గెలుపు ఎవరిది?
అదే బోరు బావిలో ఇతరులు మరియు అధికారుల కూతుర్లు పడితే ఇంత నిర్లక్ష్యం చేస్తారా అని ఆమె అధికారులపై మీడియా సమావేశంగా మండిపడింది. నా కూతురు బోరుబావిలో పడి దాదాపుగా ఆరు రోజులు అవుతుంది, ఎంత ఆకలిగా మరియు దాహంతో నరకం అనుభవిస్తుందో మీకు తెలియదా అంటూ మీడియా సమావేశముగా చెప్పుకొచ్చింది. ఇదే పరిస్థితుల్లో మీ పిల్లలు ఉంటే ఇలానే నిర్లక్ష్యం చేస్తారా అని ఏడుస్తూ ప్రశ్నించారు.
హైడ్రా కూల్చివేతలు ఆగవు.. పెద్ద భవనాలపైనా కూల్తేస్తం!
అధికారులు మాపై దయవుంచి మా కూతురిని త్వరగా బయటికి తీసుకురావాలని ఆ తల్లి మరియు బంధువులు అధికారులను వేడుకున్నారు. కాగా ఆ చిన్నారి ఈనెల 23వ తారీఖున పొలం వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడింది. ప్రస్తుతం ఈ చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకు వచ్చేందుకు అధికారులు సర్వత్రా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కాగా ఇన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికి వారం రోజులు అవుతుండడంతో చిన్నారి ఆరోగ్యం పూర్తిగా నాశనం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు.