Teen Raped and Blackmailed: కర్నాటకలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కాలేజీ యువతి, ఆమె బాయ్ ఫ్రెండ్ తో రహస్యంగా ఉన్న వీడియోను సీక్రెట్ గా షూట్ చేసి, బ్లాక్ మెయిల్ చేశారు. ముగ్గురూ కలిసి కొద్ది నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వేధింపులు పెరగడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
బెంగళూరుకు చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో ఒక విద్యార్థి లోబర్చుకున్నాడు. అతడి స్నేహితులు దీనిని రికార్డ్ చేశారు. ముగ్గురూ బ్లాక్‌మెయిల్ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి ఫిర్యాదుతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. బెంగళూరులోని మాగడి ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యవతి కాలేజీలో చదువుతున్నది. ఆరు నెలల కిందట కాలేజీ స్టూడెంట్ వికాస్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కాగా, ప్రేమ పేరుతో ఆ యువతిని వికాస్ లోబర్చుకున్నాడు. అతడి ఫ్రెండ్ ప్రశాంత్ ఇంటికి ఆమెను పలుమార్లు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
సీక్రెట్ గా వీడియో రికార్డ్ చేసిన మరో స్నేహితులు
మరో స్నేహితుడు చేతన్ వారిద్దరు క్లోజ్ గా ఉన్నప్పుడు వీడియో రికార్డ్ చేశాడు. ఆ ముగ్గురూ కలిసి సెప్టెంబర్ నుంచి ఆమెను బ్లాక్‌మెయిల్ చేశారు. తాము కోరినప్పుడల్లా ఆ రూమ్‌కు రావాలని బెదిరించారు. గత రెండు నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. వారి లైంగిక వేధింపులను ఆ యువతి భరించలేకపోయింది. డిసెంబర్ 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆ యువతికి తెలిసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. నిందితుల్లో ఇద్దరు విద్యార్థులని వెల్లడించారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్లు తెలిపారు. కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.





