
Mexico Flash Floods: నిన్మ మొన్నిటి వరకు అమెరికాను వణికించిన వరదలు.. ఇప్పుడు మెక్సికోలో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆదేశంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా రుయిడోసోలో ఆకస్మిక వరదలు సంభవించాయి. నదులన్నీ ప్రమాదకర స్థాయిలో పరుగులు తీస్తున్నాయి. వరదల ధాటికి ఊళ్లన్నీ జలమయం అయ్యాయి. కొన్నిట్లో వరద తీవ్రతకు ఇండ్లు పడవల్లా కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు
వరదల తీవ్రత పెరగడంతో మెక్సికన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించారు. వార్ రూమ్ ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆకస్మిక వరదలకు పలు ఇళ్లు కొట్టుకుపోయి, వందల సంఖ్యలో ప్రజలు గల్లంతు అయినట్లు తెలిపారు. వారిని కాపాడేందుకు సహాయక చర్చలు కొనసాగుతున్నాయన్నారు. రుయిడోసో నది 20 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ప్రవహిస్తోందన్నారు. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నది ప్రవాహానికి సమీపంలోని ముంపు బాధిత ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ వరదల్లో వందలాది మంది చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వరదల కారణంగా ముగ్గురు చనిపోయినట్లు వెల్లడించారు. రుయిడోసోలో సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: శ్రీశైలానికి భారీ వరదల, సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు!