
క్రైమ్ మిర్రర్, వెబ్ డెస్క్ :-
గత నెల రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా మార్చి నెలలో భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. భారీ ఎండల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అల్లాడిపోయారు. బయటకు వస్తే భారీ ఉష్ణోగ్రతలు.. ఇంట్లో ఉంటే ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అయితే ఏప్రిల్ నెలలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలతో పాటు పలు చోట్ల వర్షాలు దంచికొడుతున్నాయి.గత మూడు వారాలు చూసుకుంటే.. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయంటే ఎండలు ఏ రేంజ్ లో కొడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మూములుగా మే నెలలో ఎండలు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. మార్చి మాసంలోనే ఎండలు మే నెలను తలపించాయి. ఏప్రిల్ నెలలో మాత్రం పలు చోట్ల ఎండలతో పాటు వర్షాలు కొడుతున్నాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో గత రెండు, మూడు రోజుల నుంచి చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కొన్ని చోట్ల అయితే 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదు అయ్యాయి. దీంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో దంచి కొట్టాల్సిన ఎండలు.. ఇప్పుడే చుక్కలు చూపిస్తున్నాయి. అయితే ఈ సమయంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది.
తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. అయితే, మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు కూడా రానున్న మూడు రోజుల పాటు మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు పెరుగనున్నాయని.. రెండు నుంచి మూడు డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.అకాల వర్షాల పట్ల రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాత్రి సమయంలో పొలాల వద్దకు వెళ్లొద్దని చెబుతున్నారు.