ఆంధ్రప్రదేశ్ లో నేటినుంచి మూడు రోజులు పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తాజాగా దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. అలాగే ఉత్తరకోస్తాంధ్ర మరియు యానంలో పొడి వాతావరణం ఉంటుందని కూడా తెలిపింది.
Read More : జీవితం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం : ఎస్సై మాధవరెడ్డి
కాగా ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి వర్షం ప్రారంభం అయింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. కాగా ఇవాల్టి నుంచి మూడు రోజులు పాటు పలు ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని తెలిపింది. అది కాకుండా సరిగ్గా పండుగ సమయంలోనే వర్షాలు పడడంతో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఇవాళ భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ పండుగలు ఉండడంతో వర్షాలు పడని సమయంలోనే బయటకు వెళ్లాలని అధికారులు తెలియజేశారు. ఏ ఒక్కరు కూడా అజాగ్రత్తగా ఉండకూడదని తెలియజేశారు.
Read More : మస్తాన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో కూకట్ పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్
ఈ మూడు రోజులు పాటు వర్షాలు పెద్దగా ప్రభావం చూపవని అని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క జాగ్రత్తలలో వారు ఉండాలని తెలియజేశారు. అత్యవసరమైతేనే తప్ప బయటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పండగ సమయంన ఇతర రాష్ట్రాల నుంచి తమ సొంత గ్రామాలకు ఎంతోమంది వచ్చి ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాలువలకు లేదా చెరువులకు పిల్లలను వెంట తీసుకు వెళ్ళవద్దు అంటూ పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు వ్యవసాయ పనుల నిమిత్తం బయటకు వెళ్లే రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
Read More : చంద్రబాబుకు షాక్.. అమరావతిని లైట్ తీసుకున్న సీఎం రేవంత్