
శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయాన్ని అధికారులు తాజాగా మూసి వేశారు. తాజాగా మండల పూజలు అనేవి ముగిసిన సందర్భంగా అయ్యప్ప భక్తుల దర్శనాలను నిలిపివేశారు. కాగా ఈనెల 30వ తారీకు నుండి మళ్లీ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తిరిగి తెరుచుకుంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటివరకు దాదాపుగా శబరిమల లోని అయ్యప్ప స్వామి దేవాలయాన్ని 32 లక్షల 50 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.
బలహీనపడిన అల్పపీడనం!… తగ్గనున్న వర్షాలు?
ఇక జనవరి 14వ తారీఖున శబరిమల అయ్యప్ప స్వామి కొండపై మకర జ్యోతి దర్శనం ఇవ్వనుంది. కాబట్టి కొన్ని వేలల్లో
భక్తులు ఈ మకర జ్యోతి చూడడానికి వస్తారు కనుక ఆలయ అధికారులు ఇప్పటికే అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. పూర్తిగా పోలీసుల బందో బస్తీ ఏర్పాటు చేశారు. ఇక చివరిగా జనవరి 20వ తారీఖున పడిపూజతో ఈ యాత్ర అనేది ముగియనుంది.
తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. ఏడు రోజు సంతాప దినాలు
కాగా ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా కొన్ని లక్షల మంది శబరిమల లోని అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప మాల ధరించిన వారు దాదాపుగా 48 రోజులు పాటుగా దీక్షలో ఉన్న ప్రతి మనిషి అనేక నియమాలను భక్తిశ్రద్ధలతో పాటిస్తూ ఉంటాడు. ఇక చివరిగా శబరిమలలోని అయ్యప్ప స్వామిని దర్శించుకుని ఇరుముడిని అయ్యప్ప స్వామికి అందించి మాల దారణ అనేది విరమిస్తారు.