ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 3 రోజులు సెలవులు!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు సంబంధించి పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన సెలవులు ముగిసిన వెంటనే మరోసారి సెలవుల సందడి మొదలైంది.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు సంబంధించి పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన సెలవులు ముగిసిన వెంటనే మరోసారి సెలవుల సందడి మొదలైంది. ఉద్యోగులు, విద్యార్థులకు ఊరట కలిగించేలా వరుసగా 3 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగం సహా పలు కార్పొరేట్ కంపెనీల్లో వారానికి 5 రోజులే పని దినాలుగా ఉండటంతో శని, ఆదివారాలు ఇప్పటికే సెలవులుగా మారాయి. ఈ క్రమంలో సోమవారం రిపబ్లిక్ డే పబ్లిక్ హాలిడే కావడంతో వరుసగా 3 రోజులు పనులకు విరామం దక్కనుంది. దీంతో ఈ వారాంతం ఉద్యోగులకు లాంగ్ వీకెండ్‌గా మారింది.

ఇదే సమయంలో విద్యార్థులకు కూడా ఆనందకరమైన వార్తగా ఈ సెలవులు మారనున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఇప్పటికే వారానికి 5 రోజులే బోధన కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శని, ఆదివారాలు సహజంగానే సెలవులుగా ఉండగా, 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా పబ్లిక్ హాలిడే రావడంతో విద్యార్థులకు వరుసగా 3 రోజులు స్కూళ్లకు విరామం లభించనుంది. దీంతో రేపటి నుంచే పిల్లలు సెలవుల మూడ్‌లోకి వెళ్లనున్నారు.

ఈ లాంగ్ వీకెండ్‌ను ఉపయోగించుకుని చాలా మంది కుటుంబ సమేతంగా విహారయాత్రలకు, స్వగ్రామాల సందర్శనకు ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు నగరాల్లో ట్రాఫిక్ కొంత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. టూరిస్ట్ ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్ట్స్‌కు ముందస్తు బుకింగ్స్ కూడా పెరిగినట్లు సమాచారం. మొత్తం మీద సంక్రాంతి తర్వాత మళ్లీ వచ్చిన ఈ 3 రోజుల సెలవులు ఉద్యోగులు, విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

ALSO READ: బాలిక శరీరం ఖరీదు రూ.లక్ష!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button