•23న వైభవోత్సవాలు – భారీ ర్యాలీ, అన్నదానం కార్యక్రమాలు
మిర్యాలగూడ,క్రైమ్ మిర్రర్:- ఈ నెల 23న సోమవారం మిర్యాలగూడ నియోజకవర్గ స్థాయిలో శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. బంజారా సోదర సోదరీమణులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జయంతి ఉత్సవాల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. గిరిజన బంజారా సమాజం అత్యంత వైభవంగా జరుపుకునే సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.జయంతి రోజున మిర్యాలగూడ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఎన్ఎస్పీ క్యాంప్‌లోని సంత్ సేవాలాల్ భవనం వరకు గిరిజన సంప్రదాయ వేషధారణలో డప్పు వాయిద్యాలు, ఆటపాటలతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వివరించారు.
అనంతరం మహాభోగ్ బండారో కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ జయంతి ఉత్సవాలకు అధికారులు, అనధికారులు, మహిళలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు విస్తృతంగా హాజరై వేడుకలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. స్వామివారి తీర్థప్రసాదాల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కొర్ర నాగునాయక్, కార్యదర్శి రవితేజ నాయక్, సర్పంచులు సిద్దు నాయక్, శ్రీహరి, మండల విద్యాధికారి ధర్మానాయక్, బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ నాయక్, కృష్ణకాంత్ నాయక్, కృష్ణానాయక్, మురళినాయక్ తదితరులు పాల్గొన్నారు.

