
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- నల్లగొండ జిల్లా దేవరకొండ లో భారీ ఘారానా మోసం వెలుగు లోకి వచ్చింది కేసు వివరాలు సిఐ నరసింహులు తెలిపారు. దేవరకొండలో బిఎన్ఆర్ కాలనీలో గత ఐదు సంవత్సరాలు గా మాదన్న కృష్ణ అలియాస్ వేణుగోపాల్ రెడ్డి అని ఒక వ్యక్తి కిరాయికి ఉంటూ తను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగినని మూడవత్ స్వాతి మరియు షేక్ తబ్రీజ్లను నమ్మించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని వారి వద్ద నుండిఒకరి వద్ద 14 లక్షలు మరియు మరొకరి దగ్గర 12 లక్షలు తీసుకొని దేవరకొండ నుండి ఎటువంటి జాబులు ఇప్పించకుండా తప్పించుకుని వెళ్లిపోయాడు. మోసపోయిన ఫిర్యాదురాలైనవారు స్వాతి మరియు తబ్రీజ్ల ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసుకొని దేవరకొండ సిఐ నర్సింహులు దర్యాప్తు మొదలు పెట్టారు.
ఇవి కూడా చదవండి
1.బీఎస్సీ చదివి… టీ కొట్టు పెట్టి ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైన యువకుడు
2.జగన్‌తో జాగ్రత్తగా ఉండండి – పార్టీ నేతలను హెచ్చరించిన చంద్రబాబు
3.విషాదమును మిగిల్చిన SLBC టన్నెల్ సంఘటన.. 8 మంది కార్మికులు మృతి!..