ఆంధ్ర ప్రదేశ్

రామ్ చరణ్ 256 అడుగుల కటౌట్!… ఇంటర్నేషనల్ రికార్డ్?

క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ వజ్ర గ్రౌండ్స్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి రామ్ చరణ్ కటౌట్ ప్రపంచ రికార్డును సృష్టించింది. గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో యువశక్తి ఆధ్వర్యంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలోని ఒక ఫోజును 256 అడుగుల భారీ కటౌట్ తో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఏకంగా హెలికాప్టర్ ద్వారా 256 అడుగుల రామ్ చరణ్ భారీ కటౌట్ పై పూల వర్షం కురిపించారు.

Read Also : మద్యం ప్రియులకు పండగే.. పండగ… వైన్స్‌ షాపులు, బార్‌ల సమయ వేళలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

తాజాగా గేమ్ చేజర్ నిర్మాత దిల్ రాజ్ మరియు గేమ్ చేంజర్ చిత్ర యూనిట్ అందరూ కలిసి ఈ భారీ రామ్ చరణ్ కటౌట్ ను ఆవిష్కరించారు. అయితే ఈ భారీ కటౌట్ కు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అవార్డు లభించింది. ఈ అవార్డును గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజ్ అందుకున్నారు.

Also Read : కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి.. ఎమ్మెల్సీ కవిత

రామ్ చరణ్ గేమ్ చేంజెర్ సినిమా జనవరి 10వ తారీఖున గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ను జనవరి ఒకటో తారీఖున విడుదల చేయనున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. డైరెక్టర్ శంకర్ ఆధ్వర్యంలో వస్తున్నటువంటి సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ భారీగానే చేస్తున్నారు మూవీ యూనిట్. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు రాబడుతుందో వేచి చూడాల్సిందే.

మరిన్ని చదవండి

  1. పదవులకే వన్నే తెచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్.. సీఎం రేవంత్ రెడ్డి
  2. అక్కినేనిని పొగిడి.. ఎన్టీఆర్ పేరెత్తని ప్రధాని మోడీ!
  3. రైతు భరోసాపై గందరగోళం.. మంత్రుల్లో విభేదాలు!
  4. తొలిసారి టైటిల్ గెలిచిన హర్యానా!… ఎట్టకేలకు నెరవేరిన కోచ్ కళ?
Back to top button