25 OTT Apps Ban: ఓటీటీల్లో అశ్లీల కంటెంట్ కట్టడికి కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. అశ్లీల చిత్రాలను ప్రసారం చేస్తున్న 25 యాప్ లు, వెబ్ సైట్లను బ్యాన్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ రూల్స్, అశ్లీల నిషేధ చట్టాలను ఇవి ఉల్లంఘిస్తూ సాఫ్ట్ పోర్న్ కంటెంట్ ను ప్రసారం చేస్తున్నాయని వెల్లడించింది. ఈ యాప్ లు అడల్ట్ కంటెంట్ ను ప్రసారం చేస్తున్నాయి పలువురు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో కేంద్ర ఐటీ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. అశ్లీల కంటెంట్ మైనర్లకు సులభంగా అందుబాటులో ఉండకుండా నిరోధించడం కోసం ఈ బ్యాన్ విధిస్తున్నట్లు తెలిపారు. హోం, మహిళా, శిశు సంక్షేమం, న్యాయ శాఖలతో పాటు మహిళలు, పిల్లల హక్కుల కార్యకర్తలతో సంప్రదింపులు జరిపాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
కేంద్రం బ్యాన్ చేసిన ఓటీటీ యాప్స్ ఇవే!
ప్రముఖ ఓటీటీలు ఉల్లూ, ఏఎల్‌టీటీ, దేశీఫ్లిక్స్ సహా 25 యాప్‌లపై నిషేధం విధించింది. వీటి ప్రసారాలు తక్షణం నిలిపివేయాలంటూ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అశ్లీల కంటెంట్ ప్రసారాలను అడ్డుకొనేందుకే ఈ చర్యలు తీసుకున్నామని స్పష్టం చేసింది. బ్యాన్ చేసిన యాప్స్ లోఆల్ట్ బాలాజీ (ఏఎల్‌టీటీ), ఉల్లూ, బిగ్ షాట్స్ యాప్, దేశీఫ్లిక్స్, బూమెక్స్, నియాన్ ఎక్స్ వీఐపీ, నవరస లైట్, గులాబ్ యాప్, కంగన్ యాప్, బుల్ యాప్, షోహిట్, జల్వా యాప్, వావ్ ఎంటర్ టైన్ మెంట్, లుక్ ఎంటర్ టైన్ మెంట్, హిట్ ప్రైమ్, ఫ్యూగీ, ఫీనియో, షోఎక్స్, సోల్ టాకీస్, అడ్డా టీవీ, హాట్ ఎక్స్ వీఐపీ, హల్ చల్ యాప్, మూడ్ ఎక్స్, మోజ్ ఫ్లిక్స్, ట్రైఫ్లిక్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: భార్యతో విడాకులు, వంద బీర్లు తాగిన భర్త.. చివరకు ఏమైందంటే?