Wednesday, March 18, 2026
Homeజాతీయందేశ వ్యాప్తంగా భారీ వర్షాలు.. 25 మంది మృతి!

దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు.. 25 మంది మృతి!

Rains In India: దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఫలితంగా గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 25 మంది మృతి చెందారు. పిడుగులు పడటంతో పాటు విద్యుత్ ప్రమాదాలు, నీటిలో మునిగిపోయిన ఘటనల్లో పలువురు చనిపోయారు. యూపీ, ఢీల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ లో మృత్యువాత పడ్డారు.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

యూపీలోని బల్లియా జిల్లాలో పిడుగు పడి 13 ఏళ్ల బాలిక చనిపోయింది.  బిజ్నోర్‌ జిల్లాలో మరో బాలిక వర్షం నీటిలో స్నానం చేస్తుండగా డ్రెయిన్‌ పొంగి కొట్టుకుపోయింది. యమునా నగర్‌ జిల్లా సోన్‌ బర్సాలో అర్థరాత్రి సమయంలో పిడుగు పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.  అటు గుజరాత్ లోని రాజ్ కోట్, పంచ మహల్ జిల్లాల్లో ఆకస్మికంగా వర్షాలు కురిశాయి. రాజ్‌ కోట్‌ జిల్లాలో కరెంటు షాక్‌ తో ఓ వ్యక్తి చనిపోయాడు. పంచమహల్‌ జిల్లాలో పిడుగుపడి ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోకపోయినా, భారీగా ఆస్తినష్టం జరిగింది.

కరెంటు తీగలపై చెట్టుకూలి ఇద్దరు మృతి

అటు ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. ఈ నేపథ్యంలో ఓ సెల్ ఫోన్ టవర్ కూలింది. పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై ఓ చెట్టు కూలడంతో కరెంట్ షాక్ తగిలి, ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.  మహారాష్ట్రలో పిడుగులుపడి 8 మంది చనిపోయారు. హిమాచల్‌ ప్రదేశ్‌ లో వరుసగా మూడు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములతో పాటు పిడుగులు పడతాయని హెచ్చరించారు.

Read Also: బ్రిడ్జి కూలి ఆరుగురు మృతి, 25 మంది గల్లంతు!

 

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments