ఏలూరు, క్రైమ్ మిర్రర్: పేదోడి బియ్యం పేదల కు దక్కకుండా తరలిస్తూ, పట్టుబడ్డ సంఘటనలు దేశంలో ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు రూరల్ మండలం, తంగెళ్లమూడి పంచాయతీ పరిధిలో రత్నాస్ దాబా బిల్డింగ్ వద్ద 14 చక్రాల గల అశోక్‌లేలాడ్ లారీని ఆపి విజిలెన్సు, పౌర సరఫరాల శాఖ అధికారులు ఆపి తనిఖీ చేశారు. తనిఖీలో అక్రమంగా 25.80 టన్నుల రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకొని లారీని సీజ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎవరైన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించినా, విక్రయించిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
25.80 టన్నులు రేషన్ బియ్యం పట్టివేత
RELATED ARTICLES
