
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మార్చి రెండవ తారీకు నుంచి 31వ వరకు షాపులను 24 గంటలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే సిబ్బంది రోజుకు 8 గంటలు లేదా వారానికి 48 గంటలకు మించి పని చేస్తే యాజమాన్యం రెట్టింపు వేతనం చెల్లించాలని స్పష్టం చేశారు. ఇక సెలవు దినాల్లో పని చేస్తే ప్రత్యామ్నాయా లీవు ఇవ్వాలని తెలియజేశారు. కాబట్టి ఇటువంటి నిబంధనలను కచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించాలని సంజయ్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి