
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాఖలకు భారీగా నిధులు కేటాయించారు. పంచాయతీరాజ్ కు 18,848 కోట్లు, సైన్స్ అండ్ టెక్నాలజీకి 796 కోట్లు, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా అలాగే పర్యావరణం మరియు అటవీ శాఖకు ఈ విధంగానే భారీగా నిధులు కేటాయించారు. ఇక 2025-26 వార్షిక బడ్జెట్ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల 359 కోట్లుకు చేరింది. కాగా ప్రస్తుతానికి ఏపీ బడ్జెట్ తొలిసారి మూడు లక్షల కోట్లు దాటింది.
ఇకపై గ్రామ సర్వేయర్లకు హాజరు తప్పనిసరి : ఏపీ ప్రభుత్వం
ఇంకా ఇందులో అత్యధికంగా అమరావతి నిర్మాణానికి 6000 కోట్లు మరియు వ్యవసాయానికి 48 వేల కోట్లు, పాఠశాల విద్యాశాఖకు 31,806 కోట్లు కేటాయించారు. పురపాలక శాఖకు 13,862 కోట్లు అలాగే ఇంధన శాఖకు 13,600 కోట్లు తయించినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఇక వ్యవసాయ శాఖకు 11636 కోట్లు , సాంఘిక సంక్షేమానికి 10109 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమానికి 10619 కోట్లు , రవాణా శాఖకు 8785 కోట్లు కేటాయించామని స్పష్టం చేశారు.
చనిపోయిన కోళ్లను చెరువు కట్టపై పడేసిన దుండగులు..
అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పర్యావుల కేశవ కీలక ప్రకటన. ఏపీలో కొత్త పథకం అమలులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఇది కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు 25 లక్షల ఆరోగ్య భీమా పథకం అమలులోకి చేస్తామని ప్రకటించారు. ఈ పథకం వల్ల మధ్యతరగతి మరియు పేద ప్రజలు ఎలాంటి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం చేయించుకోవచ్చు అని తెలిపారు. ఆరోగ్య శాఖకు 19264 కోట్లు కేటాయించారు.