ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ

పాకిస్తాన్‌తో యుద్ధం – డేంజర్‌ జోన్‌లో విశాఖ- హైదరాబాద్‌ను టార్గెట్‌ చేసే అవకాశం ఎంత…?

క్రైమ్ మిర్రర్, న్యూస్:- భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు యుద్ధానికి చేరువలో ఉన్నాయి. ఇండియన్‌ ఆర్మీ దెబ్బకు చతికిల పడుతున్నా… ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది దాయాది దేశం. భారత్‌పై దాడులకు తెగబడినప్పుడల్లా… చావుదెబ్బ తింటోంది. అయినా వక్రబుద్ధి మాత్రం బయటపెడుతూనే ఉంది. అణుబాంబు వేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతోంది. మరోవైపు… పాక్‌ దుశ్చర్యలకు తగిన బుద్ధి చెప్తోంది భారత్‌. ముష్కరులు కనిపిస్తే కాల్చివేత… పాక్‌ డ్రోన్లు కనిపిస్తే.. కూల్చివేత అన్నట్టు దూసుకుపోతోంది.

పెహల్గామ్‌ దాడి తర్వాత భారత్‌.. ఆపరేషన్‌ సిందూర్‌ చేప్టటింది. ఉగ్రవాదుల స్థావరాలను టార్గెట్‌ చేసింది. రూల్‌ ప్రకారం భారత్‌కు ఆ హక్కు ఉంది. కానీ… పాకిస్తాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత.. భారత్‌పై దాడికి ప్రయత్నించి.. బొక్క బోర్లా పడుతోంది. మిత్రదేశాల చాటుమాటు మద్దతుతో కుట్రలు చేస్తోంది. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగినా… మరింత తీవ్రమైనా.. యుద్ధం అనివార్యమవుతుంది. భారత ప్రజలు ఏది కోరుకుంటే అదే జరుగుతుందన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చేసిన ప్రకటన వెనుక ఆంతర్యం కూడా ఇదేనా అన్న ఆలోచన కలుగుతోంది. అంతేకాదు ప్రధాని మోడీ కూడా వరుసపెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో.. వార్‌ అనివార్యమైందని అనిపిస్తోంది. వార్‌ అంటూ వస్తే… మన దేశంలోని ఏయే నగరాలను పాకిస్తాన్‌ టార్గెట్‌ చేసే అవకాశం ఉంది. ఏయే నగరాలు ఎఫెక్ట్‌ అవుతాయి. ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..? అన్నది ఒకసారి చూద్దాం.

పాకిస్తాన్‌ దాడుల నేపథ్యంలో భారత్‌… కీలక నగరాల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించింది. యుద్ధం అంటూ వస్తే… ప్రజలు ఎలా ఎదుర్కోవాలని… ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఈ మాక్‌ డ్రిల్‌ ఉద్దేశం. ఈ మాక్‌ డ్రిల్‌ కోసం దేశంలో నగరాలను మూడు కేటగిరీలుగా విభజించింది కేంద్రం. మొదటి కేటగిరిలో ఢిల్లీ, తారాపూర్‌ ఉన్నాయి. రెండో కేటగిరీలో పాక్‌తో సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్‌, పంజాబ్‌ ఉన్నాయి. అసోం, బీహార్‌లోని చాలా ప్రాంతాలను కూడా కేటగిరీ-2లో చేర్చింది కేంద్రం.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే… హైదరాబాద్‌, విశాఖ కేటగిరీ-2లో ఉన్నాయి. ఇదే ఇప్పుడు.. కాస్త ఆందోళన కలిగించే విషయం. అంటే.. హైదరాబాద్‌, విశాఖ కూడా డేంజర్‌ జోన్‌లో ఉన్నట్టే. 1971లో కూడా పాకిస్తాన్, మిత్రదేశాలతో కలిసి.. జలమార్గం ద్వారా విశాఖను ఎటాక్‌ చేయబోయింది. కానీ… ఆ ప్రయత్నం ఫలించలేదు. ఇప్పుడు.. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య యుద్ధం అనివార్యమైతే.. పాకిస్తాన్‌ హిట్‌ లిస్ట్‌లో విశాఖ కూడా ఉంటుంది. సముద్రమార్గం ద్వారా విశాఖను అటాక్‌ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీచ్‌ రోడ్డులోని కళింగలో రక్షణ శాఖకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి. దీంతో… విశాఖలో భద్రత కట్టుదిట్టం చేశారు. భద్రతా దళాలు కూడా డేగ కన్ను వేసున్నాయి.

ఇక.. హైదరాబాద్‌. పాకిస్తాన్‌ కన్ను హైదరాబాద్‌పై కూడా పడినట్టు కేంద్రం భావిస్తోంది. హైదరాబాద్‌ను కూడా పాక్‌ టార్గెట్‌ చేసే అవకాశం ఉండొచ్చని అంచనా వేస్తోంది. పాక్‌ వక్రబుద్ధి తెలిసిందే కనుక… ప్రత్యక్షంగా కాకపోయినా… పరోక్షంగా అయినా హైదరాబాద్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేయొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. దీంతో… హైదరాబాద్‌లో కూడా భద్రతా బలగాలను అప్రమత్తం చేసింది సెంట్రల్‌ గవర్నమెంట్‌. ఏ క్షణంలో ఏం జరిగినా…? ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది.

ఆపరేషన్ సింధూర్ పై.. సంచలన పోస్ట్ చేసిన సానియా మీర్జా!.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button