క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, వేములపల్లి : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు,జంతువులకు, ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారింది. ఒరిగిన విద్యుత్ స్తంభాలు, తీగలు వేలాడుతుండడం, ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కంచెలు లేకపోవడంతో వ్యవసాయ రైతులు, వాహనదారులు ఏ క్షణాన ప్రాణ నష్టం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలలోకి వెళితే నల్గొండ జిల్లా, మిర్యాలగూడ నియోజకవర్గం, వేములపల్లి మండలం పరిధిలోని ఆమనగల్లు గ్రామం రెవెన్యూ పరిధిలో ఉన్న వ్యవసాయ క్షేత్రాలలో విద్యుత్ స్తంభాలు చాలా వరకు పడిపోయేలాగా క్రిందికి ఒరిగి ఉండడం, ఆ స్తంభాల తీగలు చేతికందేల వేలాడుతున్నాయని పలుమార్లు పత్రికలలో కథనాలు వచ్చినప్పటికీ విద్యుత్ అధికారులలో మారని నిర్లక్ష్య ధోరణి అని విమర్శలు వినిపిస్తున్నాయి.
Read Also : తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. పార్టీకి కీలక నేత రాజీనామా
మరోచోట నిత్యం వందలాది మంది ప్రయాణించే లక్ష్మీదేవిగూడెం అడ్డరోడ్డు నుండి పాములపహాడ్ గ్రామం వెళ్లే మార్గం మధ్యలో రోడ్డుకి ఆనుకొని ఎలాంటి రక్షణ కంచ వేయకుండా ప్రమాదకర పరిస్థితుల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ట్రాన్స్ఫార్మర్లు ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదు ఆ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ రక్షణ కంచ వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ రోడ్డు గుండా వందలాది మంది ప్రయాణికులు, జంతువులు, రైతులు సంచరిస్తుంటారు ఎప్పుడు ఏ క్షణాన ప్రమాదం సంభవిస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అక్కడే మరో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఉన్న విద్యుత్ స్తంభం పూర్తిగా నేలకు ఒరిగి ఎప్పుడు ఎలాంటి ప్రమాదం తలపిస్తుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారు..
Also Read : ఎంపీ పదవికి వెంకటేష్ నేత రాజీనామా.. బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు!!
అంతేకాక అటుగా ఉన్న వ్యవసాయ క్షేత్రాలలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు అన్ని అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యం కండ్లకు కట్టొచ్చినట్లుగా తెలుస్తుందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇదే విషయంపై విద్యుత్ అధికారులకు తెలియచేసిన చూసి చూడనట్లు, విని వినట్లుగా వ్యవహరిస్తున్నారని రైతులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందించి ఒరిగిన స్తంభాలను, వేలాడుతున్న తీగలను మరియు ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ రక్షణ కంచ ఏర్పాటు చేసి లేదా ట్రాన్స్ఫార్మర్లని రోడ్డు వెంబడి తీసివేసి రోడ్డుకు దూరంగా ఉండేలాగా చూడాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు..
ఇవి కూడా చదవండి :
One Comment