
Actor Fish Venkat: తెలుగు సినిమా పరిశ్రమలో హాస్య నటుడిగా, విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొంత కాలం వెంకట్ కిడ్నీ సహా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. డయాలసిస్ కూడా చేసుకున్నాడు. ఆరోగ్యం కుదుటపడినట్లు కనిపించినా, మళ్లీ తిరగబెట్టింది. తాజాగా పరిస్థితి మరింత క్షీణించండంతో హాస్పిట్లలో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేషన్ మీద చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆయన ఎవరినీ గుర్తు పట్టే పరిస్థితిలో లేడని చెప్పుకొచ్చారు.
సాయం చేయాలని వెంకట్ భార్య విజ్ఞప్తి
ఫిష్ వెంకట్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబ కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులో ఉంది. ఈ నేపథ్యంలో చికిత్స చేయించేందుకు డబ్బులు కూడా లేని పరిస్థితి. దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆమయన భార్య, కూతురు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. సినీ అభిమానులు, సినీ పెద్దలు ఆర్థికంగా అండగా నిలవాలని కోరుతున్నారు.
గతంలో పవన్ కల్యాన్ సాయం
కొద్ది కాలం క్రితం వెంకట్ కు కిడ్నీ సమస్యలు తలెత్తాయి. గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఈ విషయం తెలిసి పవన్ కల్యాన్ రూ. 2 లక్షలు ఆర్థికసాయం చేశారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం కుదుటపడింది. కానీ, ఇప్పుడు మరోసారి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. మళ్లీ హాస్పిటల్ పాలయ్యాడు.
డాక్టర్లు ఏం అంటున్నారంటే?
ప్రస్తుతం వెంకట్ కు కిడ్నీ సమస్య ఉందని డాక్టర్లు తెలిపారు. ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నప్పటికీ, కేవలం తాత్కాలిక పరిష్కారం మాత్రమే అన్నారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కచ్చితంగా చేయాలంటున్నారు. అయితే, ఈ ఆపరేషన్ ఆర్థిక ఇబ్బందులతో కూడుకున్న వ్యవహారం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమా పెద్దలు ఆదుకోవాలని కోరుతున్నారు.
Read Also: అడ్డగోలు వార్తలు రాసేవాళ్లను లోపలేయండి.. కోర్టు సంచలన తీర్పు