Telangana

బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. పార్టీకి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గుడ్‌బై

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న ఆ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు, కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆ పార్టీకి చెందిన సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కారు దిగారు. గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవటంతో ఆయన మనస్థాపం చెందారు.

Also Read : ఎవ్వర్నీ వదలం, విచారణ జరిపిస్తాం.. యాదాద్రి పున‌ర్నిర్మాణంలోనూ అవినీతి : మంత్రి కోమటిరెడ్డి

బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయి పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుల గురించి చర్చించుకోవటంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. తనను వ్యక్తిగతంగా దూషించిన ఆర్ఎస్పీతో పొత్తులపై చర్చించటంతో ఆయన మసస్థాపం చెందినట్లు తెలిసింది. తాను కేసీఆర్‌ను ఎంతో గౌరవించానని.. అయినా తనకు మాట కూడా చెప్పకుండా పొత్తు చర్చచలు పెట్టుకున్నారని తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోనేరు కోనప్ప, బీఎస్పీ నుంచి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. బీజేపీ నుంచి పాల్వాయి హరీష్ బాబు పోటీ చేశారు.

Read Also : లోక్‌సభ ఎన్నికల కాంగ్రెస్‌ తొలి జాబితాపై కసరత్తు.. రేపు కాంగ్రెస్‌ సెంట్రల్ ఎలక్షన్‌ కమిటీ భేటీ

అయితే అనుహ్యంగా ఆ స్థానంలో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ అభ్యర్థి హరీష్ బాబు 2923 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి కోనప్ప 60,379 ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మూడోస్థానంలో నిలిచారు. ఆయనకు 44,151 ఓట్లు వచ్చాయి. గతంలో కోనప్ప 2014లో బీఎస్పీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆపై టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాజాగా.. బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన కోనప్ప త్వరలో కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 12 లేదా 13న ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి : 

  1. రూ.500లకే సిలిండర్‌ పథకం.. ముందు మొత్తం ధర చెల్లించాల్సిందే!
  2. కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థులు.. BRS నుంచి వచ్చిన ‘ఆ నలుగురికి’ ఫిక్స్??
  3. తాగుడు ఎంత పని చేసింది.. గదిలో ఉండగానే ఇల్లు కూల్చివేత.. వ్యక్తి మృతి
  4. దోస్త్ మేరా దోస్త్.. సీఎం రేవంత్ రెడ్డిపై ఉత్తమ్, కోమటిరెడ్డి ప్రశంసల జల్లు.. కారణం ఏంటి..?
  5. భారీ ఉద్యమానికి బీఆర్‌ఎస్‌ సన్నాహాలు.. నీటి పోరు యాత్ర పేరుతో త్వరలో ప్రజాల్లోకి..!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.