ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో భూకంపం ప్రజలను భయపడుతుంది. ప్రకాశం జిల్లా లో ఒకే రోజు రెండుసార్లు భూకంపం రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్నారు. నిన్న ఆదివారం రోజున రెండుసార్లు భూకంపం వచ్చినట్లుగా అధికారులు తెలియజేయడంతో ప్రతి ఒక్కరు కూడా షాకు కు గురవుతున్నారు. ఎందుకు ఇలా ఒక రోజులోనే రెండుసార్లు కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించడం తో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యంతో పాటు భయాందోళనకు గురయ్యారు.
అల్లు అర్జున్ ఇంటిపై దాడి… నిందితులకు బెయిల్ మంజూరు
ప్రకాశం జిల్లాలోని తాళ్లూరు మరియు ముండ్లమూరు మండలాలలో ఒకేరోజు రెండుసార్లు భూకంపం వచ్చింది. ఈ రెండు మండలాలలో కూడా వరుసగా భూకంపాలు రావడం అనేది ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. కాగా నిన్న ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో భూకంపం వచ్చిన విషయం మనందరికీ మీడియా కథనాల ద్వారా తెలిసింది. అయితే మళ్లీ అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు మళ్ళీ రెండు సెకండ్ల పాటు భూమి కంపించడం తో ప్రజలందరూ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.
అయితే ప్రకాశం జిల్లాలోని తాళ్లూరు మండలంలో గంట వ్యవధిలోని రెండుసార్లు భూకంపం రావడంతో ప్రజలందరూ కూడా ఉలిక్కిపడ్డారు. ఇక ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్న అధికారులు భూకంపంపై పరిశోధనలు చేపట్టారు. అయితే తాజాగా భూమి లోపల ఉన్నటువంటి పొరల సర్దుబాటు వల్లనే భూకంపాలు వస్తున్నాయంటూ తెలియజేశారు. అయితే ఎవరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దని సూచనలు మరియు సలహాలు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా సరే ఒక రోజులోనే రెండు, మూడు సార్లు భూకంపాలు కొద్ది సెకండ్ల పాటు రావడం అనేది గమనించిన అందరూ కూడా భయపడుతున్నారు.
అల్లు అర్జున్ ను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది : అల్లు అరవింద్