
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కార్ మరో న్యూస్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటికే ఒకసారి ఆధార్ నమోదు క్యాంపులు నిర్వహించగా.. నేటి నుంచి రెండో విడత ఆధార్ నమోదు క్యాంపులు నిర్వహించనున్నారు. నేటి నుంచి 28వ తేదీ వరకు రెండో విడత ఆధార్ నమోదు క్యాంపులు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. ఎవరైతే ఆరు సంవత్సరాల లోపు చిన్నారులు ఉంటారో… వారికి డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్ అప్డేట్స్ లాంటివి సైతం కూడా ఈ కేంద్రాల వద్దనే చేసుకోవచ్చు. తాజాగా ఈ మేరకు రెండో విడత ఆధార్ క్యాంపులు నమోదు కార్యక్రమాలను గ్రామ మరియు వార్డు సచివాలయాలలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు ఏర్పాటు చేశారు. కాబట్టి ఆధార్ కార్డులకు సంబంధించి ఏవైనా అప్డేట్ చేయించుకోవాలంటే గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఉచితంగా చేసుకోవచ్చని అధికారులు తెలియజేశారు.
కాగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఆధార్ కార్డు నమోదు చేసుకోని పిల్లల సంఖ్య 1,86,709 మంది ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. కాబట్టి ప్రతి పథకానికి అలాగే ప్రతి అంశానికి కూడా ఆధార్ తప్పనిసరి. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ నేటి నుంచి 28వ తేదీ వరకు ఉచితంగా నిర్వహిస్తున్న రెండో విడత ఆధార్ నమోదు క్యాంపులు దగ్గరకు వెళ్లి ఆధార్ కార్డులకు సంబంధించి ఏమైనా తప్పులుంటే సరిచేసుకోవాలని సూచించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు. ఈ రోజుల్లో ఆధార్ కార్డు అనేది మనిషి గుర్తింపు కార్డుగా మారిపోయింది. చిన్న పనికి కూడా ఆధార్ కార్డు తప్పనిసరి కాబట్టి ప్రతి ఒకరు ఏమైనా తప్పులుంటే ఈ ప్రత్యేక శిబిరాల ద్వారా సరి చేసుకోవాలని కోరారు.
బెట్టింగ్ సమయం… యువకుల ఫోన్లను తనిఖీ చేస్తున్న పోలీసులు?
సర్పంచ్ పదవి కోసం తండ్రిని చంపించిన కూతురు.. సూర్యాపేట జిల్లాలో దారుణం